సమాజసేవకు నాటా అంకితం
నార్త్ అమెరికన్ తెలుగు అసొసియేషన్ (నాటా) పుట్టినప్పటి నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఇందులో సభ్యులయ్యారు. నాటా ఆశయాలు, కార్యక్రమాలు ఎందరినో ఆకర్షించాయి. నాటా చేసే ప్రతి కార్యక్రమం సమాజసేవలో భాగంగానే ఉంటోంది. నాటా నిర్వహించే ప్రతి మహాసభలకు తెలుగు ప్రజలు వేలాదిగా తరలివచ్చి దీవిస్తున్నారు. తెలుగు అనే భాష కింద అంతరాల్లేవు. ప్రాంతీయ బేధాలు లేవు. అందరం ఒకే గొడుగు కిందికి వస్తున్నాం. ఎక్కడో నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చా. నాకు 17 ఏళ్ల వయస్సు వచ్చే వరకు మా ఊళ్లో కరెంటు గానీ, తాగు నీరు గానీ లేవు. అలాంటి పరిస్థితి నుంచి అమెరికాకు వచ్చి అతి పెద్ద ఆస్పత్రుల నెట్ వర్క్ ప్రైమ్ ఏర్పాటు చేసి 45వేల అమెరికన్లకు ఉద్యోగలిచ్చా. నేను సంపాదించిన దాన్ని సమాజానికి పంచేందుకు దాత్రుత్వాన్ని ఎంచుకున్నా. సమాజానికి వీలైనంత అందిస్తున్నా. అదే స్పూర్తితో నాటాను ఏర్పాటు చేశాం. ఈ మహాసభలకు కూడా అందరూ వచ్చి విజయవంతం చేయాలి.
డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి, నాటా అడ్వైజరీ కౌన్సిల్