ASBL Koncept Ambience

తానా మహాసభలకు నటకిరీటీ డా. రాజేంద్రప్రసాద్‌

తానా మహాసభలకు నటకిరీటీ డా. రాజేంద్రప్రసాద్‌

ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ మహాసభల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు, నంది అవార్డు గ్రహీత, నటకిరీటి డా. గద్దె రాజేంద్ర ప్రసాద్ గారిని ఆహ్వానించినట్లు తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి లావు, మహాసభల కన్వీనర్‌ రవి పొట్లూరి తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ నటులుగా పేరు పొందిన రాజేంద్రప్రసాద్‌ నటుడిగానే కాకుండా, నిర్మాతగా, సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు. తన మాటలతో, హావభావాలతో ఆకట్టుకునే రాజేంద్రప్రసాద్‌ తానా మహాసభల్లో కూడా అందరినీ అలరించనున్నారు. ఎన్నో కార్యక్రమాలతో సంగీత విభావరులతో అలరించే తానా మహాసభలకు అందరూ హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. 

ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా తానా మహాసభలకు వచ్చి ఎంజాయ్‌ చేయండి. మహాసభల కోసం మీ పేర్లను రిజిష్టర్‌ చేసుకోండి.

https://tanaconference.org/event-registration.html

 

 

Tags :