ASBL Koncept Ambience

చికాగో సాయి మందిర్ లో దుర్గమ్మ వారి పూజలు

చికాగో సాయి మందిర్ లో దుర్గమ్మ వారి పూజలు

చికాగో నగరం లో రోలింగ్‌ మెడోస్‌ ఏరియాలో వున్న సాయి మందిర్‌ లో స్థానిక తానా నాయకులు శ్రీ హేమా కానూరు ఆధ్వర్యంలో దుర్గమ్మ వారి పూజలు ఘనంగా జరిగాయి. రెండు రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం పూట భక్తులు కుంకుమార్చనగా ఖడ్గమాల, త్రిశక్తి, నవావరణ  పూజలు  భక్తితో చేసుకొన్నారు. మొదటి రోజు సాయత్రం శివ పార్వతి కళ్యాణం కన్నుల పండుగ గా జరిగింది. మహిళలు ఆ పార్వతి - పరమేశ్వరుల కళ్యాణం లోని వివిధ ఘట్టాలలో పాల్గొని జయప్రదం చేశారు. రెండవ రోజు సాయత్రం గుడి ఆవరణ బయట ప్రత్యేకంగా  నిర్మించిన టెంట్‌ వేసి ప్రత్యేకంగా నిర్మించిన ప్రాంగణం లో ఏర్పాటు చేసిన 9 హోమగుండాలతో దాదాపు 35 మంది భక్తులు పాల్గొనగా దుర్గ గుడి అర్చకులు చండీ యాగం జరిపించారు. ఆంధ్ర రాష్ట్రం లో వున్నా కూడా దొరకని చండీ హోమం చేసుకొనే అదృష్టం, అవకాశం అమెరికా లో లభించాయని, ఈ విధంగా 9 హోమ గుండాలు ఏర్పాటు చేసి అందరు పూర్తి స్థాయిలో పాల్గొనేలా చేసిన శ్రీ హేమ కానూరు కి వచ్చిన వారు  అభినందనలు తెలిపారు. వైభవం గా జరిగిన ఈ వేడుక దుర్గా మల్లేశ్వర దేవస్థానం పురోహితులు వేద ఆశ్వీర వచనాలతో ముగిసింది.

చికాగో నగరం లో తానా పెద్దలు శ్రీ యుగంధర్‌ యాడ్లపాటి, రీజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీ హనుమంత్‌ తో పాటు, ఆటా పూర్వ అధ్యక్షులు శ్రీ కరుణాకర్‌ మాధవరం, ఆటా పూర్వ డైరెక్టర్‌ శ్రీ రవీందర్‌, నాట్స్‌ నాయకులు శ్రీ మదన్‌ పాములపాటితోపాటు పాల్గొన్నారు.

వీరితోపాటు తానా నాయకులు ఉమ, సందీప్‌, రవి, చిరంజీవి, వినోజ్‌, శివ, ఆటా నుంచి వెన్‌ రెడ్డి ఆయన మిత్రులు, ఆప్టా తరపున కుమార్‌, శ్రీనివాస్‌, ఆటా (తెలంగాణ) నుంచి నరేంద్ర, సత్య, కళ్యాణ్‌, నాట్స్‌ తరపున మనోహర్‌, కార్తీక్‌, వెంకట్‌, మూర్తి, టిటిఎ తరపున రామకృష్ణ, సిఎఎ తరపున శ్రీనివాస్‌, దినకర్‌, సిటిఎ తరపున రాంగోపాల్‌, సతీష్‌ చిగురుపాటి, ఐఎజిసి తరపున మనోజ్‌, మనబడి నుంచి సుజాత, సాయిటెంపుల్‌ నుంచి లావణ్య, అమృత, ముత్యం, రమేశ్‌, కృష్ణ ఆయన మిత్రులు కూడా పాల్గొన్నారు.


Click here for Event Gallery

 

 

Tags :