సత్యనారాయణ స్వామి దేవాలయం లో ముగింపు వేడుకలు
3 రోజులు విజయవాడ దుర్గమ్మ వారి పూజలు విజయవంతం గా నిర్వహించిన సందర్భంగా చివరి రోజు (శనివారం, 28 మే) సాయత్రం శివ పార్వతి కళ్యాణం అనంతరం జరిగిన ముగింపు సమావేశం లో చైర్మన్ శ్రీ మారేపల్లి నాగ వేంకట శాస్త్రి గారు, ప్రెసిడెంటు శ్రీ దయాకర్ దువ్వూరు దుర్గమ్మ దేవస్థానం నుంచి పూజారులు వచ్చి శాన్ హోసే జరపించినందుకు అభినందనలు, ప్రశంసలు తెలిపారు. గుడి యాజమాన్యం తరపున శ్రీ సుబ్బా రావు చెన్నూరి, దుర్గ గుడి పూజారులను శాలువాలతో సత్కరించారు.
ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ, మరియు దుర్గా మల్లేశ్వర దేవస్థానం తరపున శ్రీ సుబ్బారావు చెన్నూరి సత్యనారాయణ స్వామి దేవాలయ యాజమాన్య సభ్యులను, దేవాలయానికి అండగా వున్న ముఖ్య దాతలని దేవస్థానం వుత్తరీయలతో సత్కరించి అభినందించారు
Tags :