ASBL Koncept Ambience

న్యూ జెర్సీ సాయి దత్త పీఠం లో దుర్గమ్మ పూజలు

న్యూ జెర్సీ సాయి దత్త పీఠం లో దుర్గమ్మ పూజలు

అమెరికా లో దుర్గమ్మ వారి పూజలు లో భాగంగా విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం నుంచి నలుగురు పూజారులు వచ్చి 6 అడుగుల అమ్మ వారి విగ్రహాన్ని న్యూ జెర్సీ లో ఎడిసన్ ప్రాంతంలో వున్న శ్రీ సాయి దత్త పీఠం (శ్రీ శివ విష్ణు టెంపుల్)లో ఆవిష్కరించి, ఇక్కడి భక్తులకు దుర్గమ్మవారి దర్శనం, పూజలు చేసుకొనే అవకాశం రావటం మా అదృష్టం. ఇలాంటి సౌకర్యం కలిగించిన దేవాదాయ శాఖ కి, దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి, కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్న చెన్నూరి సుబ్బా రావు గారికి మా ధన్యవాదాలు అని శ్రీ సాయి దత్త పీఠం డైరెక్టర్ శ్రీ వేంకట్ మంత్రిప్రగడ అన్నారు. 

న్యూ జెర్సీ నగరం మధ్యలో తెలుగు వారితో నిండిన ఎడిసన్ ప్రాంతంలో వున్న షిర్డీ సాయి మందిర్ లో శివ విష్ణులు కూడా కొలువై వున్నారని, ఇప్పుడు దుర్గమ్మ గుడి నుంచి అమ్మవారు రావటం వలన న్యూ జెర్సీ లోని అమ్మవారి భక్తులు కుంకుమ పూజలు చేసుకొనే అవకాశం కలిగిందని శ్రీ మురళి మేడిచెర్ల, డైరెక్టర్, సాయి దత్త పీఠం అన్నారు.

గుడి యాజమాన్య సభ్యులు శ్రీ రమణ రెడ్డి గారు, శ్రీ దాము గేదల గారు, శ్రీమతి రోజా రఘు శర్మ శంకరమంచి, శ్రీ మధు అన్న గుడిలో జరిగే దుర్గమ్మ వారి పూజల నిర్వహణ కు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

సమయానికి అత్యవసర పనులపై ..ఈ ఆలయ ఫౌండర్ చైర్మన్, ప్రధాన పురోహితులు శ్రీ రఘు శర్మ శంకరమంచి సమయానికి ఇండియా వెళ్ళినా, గుడి యాజమాన్యం దుర్గమ్మ వారి పూజలు ఘనంగా నిర్వహించారు అని ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ, ఎన్ ఆర్ ఐ విభాగ సలహాదారు శ్రీ సుబ్బా రావు చెన్నూరి అన్నారు.

 

Click here for Event Gallery

 

Tags :