చికాగో నగరం లో రోలింగ్ మెడోస్ ఏరియా లో దుర్గమ్మ వారి పూజలు
చికాగో నగరం లో రోలింగ్ మెడోస్ ఏరియా లో వున్న షిర్డీ సాయి మందిర్ లో విజయవాడ నుంచి వచ్చిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అర్చకులచే దుర్గమ్మ వారి కుంకుమ పూజలు నేడు ఆదివారం, జూన్ 26 వ తేదీ ఉదయం 11.30am వైభవం గా ప్రారంభం అయినట్టు స్థానిక తానా నాయకులు శ్రీ హేమ కానురు తెలిపారు.
ఈ రోజు సాయత్రం శివ పార్వతుల కళ్యాణం జరుపుతున్నామని, అలాగే రేపు, సోమవారం ఉదయం 11am కి ఇంకొక బ్యాచ్ తో కుంకుమ పూజలు, రేపు సాయత్రం, 5pm కి చండీ హోమం జరుగుతాయని, భక్తులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పూజలలో పాల్గొనాలని శ్రీ హేమ కానూరు విజ్ఞప్తి చేశారు.
Tags :