హౌస్టన్ షిర్డీ సాయి మందిర్ లో వైభవంగా దుర్గమ్మ వారి పూజలు..
అమెరికా లో హౌస్టన్ లో సుగర్ లాండ్ ఏరియా లో వున్న షిర్డీ సాయి జల్ రామ్ మందిర్ తెలుగువారికి బాగా తెలిసిన బాబా దేవాలయం. "విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం వారు అమెరికా లో దుర్గమ్మ పూజలు చేస్తున్న సంగతి మనకి తెలిసినదే!. వారు హౌస్టన్ లో మన షిర్డీ సాయి మందిర్ లో చేయటం మన అదృష్టం. ఈ విధంగా గా ఎన్అర్ఐ భక్తుల కోసం అమ్మవారిని మన గుడిలో సాక్షాత్కరించటం మనకి దొరికిన గొప్ప అవకాశం. అనేక మంది మహిళలు గత రెండు రోజులుగా 3 బ్యాచ్ లలో కుంకుమ పూజలలో పాల్గొన్నారు. ఇప్పుడు శివ పార్వతి కళ్యాణం లో పాల్గొంటున్నారు. ఇంత గొప్ప అవకాశం కలిగించిన దుర్గా మల్లేశ్వర దేవస్థానానికి, ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ కు మా అభినందనలు. మా బాబా గుడి ని ఈ జైత్ర యాత్ర లో భాగం చేసిన మిత్రులు శ్రీ చెన్నూరి సుబ్బారావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు" అని షిర్డీ సాయి మందిర్ ప్రెసిడెంట్ శ్రీమతి పద్మశ్రీ ముత్యాల అన్నారు.
ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ లో ఎన్ ఆర్ ఐ విభాగంలో సలహాదారు, శ్రీ సుబ్బా రావు చెన్నూరి మాట్లాడుతూ దేవాదాయ శాఖ ప్రవేశ పెట్టిన eHundi, eDonation, పరోక్ష సేవ, మా ఊరు - మా గుడి పథకాల గురించి వివరించారు. దేవస్థానం నుంచి వచ్చిన పురోహితులు శ్రీ శంకర సాండిల్య, శ్రీ కోట ప్రసాద్, శ్రీ గోపాల కృష్ణ, శ్రీ సుబ్రమణ్య శర్మ లని పరిచయం చేశారు.