మిల్ పిటాస్ లో ఘనంగా దుర్గమ్మ వారి కుంకుమ పూజలు
అమెరికా లో శాన్ ఫ్రాన్సిస్కో నగరం లో వున్న మిల్ పిటాస్ పట్టణం లో శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం లో శుక్రవారం, 27 మే తేదీన దుర్గమ్మ వారి పూజలు మొదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఒక బ్యాచ్, సాయత్రం 6.30 గంటలకు ఇంకొక బ్యాచ్ లో మహిళలు కుంకుమ పూజ చేస్తూ ఖడ్గ మాల, లలితా సహస్ర నామ పూజ, త్రిశక్తి పూజలలో పాల్గొన్నారు.
సత్యనారాయణ స్వామి దేవాలయం వారు పూజలో పాల్గొనే మహిళలకి పూజా సామాగ్రి ఇచ్చి పూజ చేసుకొనే వీలు కల్పించారు.
ముందుగా సత్య నారాయణ స్వామి దేవాలయం చైర్మన్ శ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి, ప్రెసిడెంట్ శ్రీ దయాకర్ దువ్వూరు అందరినీ ఆహ్వానించారు. కనక దుర్గమ్మ వారిని అమెరికా పంపినందుకు దేవస్థానం కి కృతజ్ఞతలు తెలిపారు.
దేవాదాయ శాఖ, దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం తరపున శ్రీ వేంకట సుబ్బారావు చెన్నురి ప్రస్తుతం దేవాదాయ శాఖ ప్రవేశ పెట్టిన పరోక్ష సేవ వంటి పథకాలు వివరించారు. దుర్గమ్మ వారి కుంకుమపూజ విశిష్టత ను శ్రీ శంకర శాండీల్య వివరించారు.