కొలంబస్ లో ఆంధ్రా పీపుల్ ఆఫ్ సెంట్రల్ ఒహాయో అధ్వర్యంలో దుర్గమ్మ వారి పూజలు
నిన్న శుక్రవారం, జూన్ 23 వ తేదీన భారతీయ హిందూ టెంపుల్ లో ప్రారంభం అయిన విజయవాడ కనక దుర్గ పూజలు, నేడు రెండవ రోజు కూడా జరిగాయి.
భారతీయ హిందూ టెంపుల్ ప్రాంగణం లో వున్న ఓపెన్ ఆడిటోరియం లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 10 హోమ గుండాలతో, దాదాపు 50 మంది దంపతులు అత్యంత నిష్ఠ గా, విజయవాడ పురోహితులు తో కలిసి అమ్మవారి చండీ హోమం లో పాల్గొన్నారు.
ఆ తరువాత గుడి లో అమ్మవారి కుంకుమ పూజ మరొక్కసారి జరిపారు. స్థానిక పిల్లలు చేసిన శాస్త్రీయ నృత్యాలు అందరినీ అలరించాయి.
భక్తులు అందరూ భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదాలు తీసుకొన్నారు. ఆంధ్రా సంఘం అధ్యక్షులు శ్రీ వేణు పసుమర్తి స్పాన్సర్స్ అందరినీ అభినందించారు.
Tags :