అమెరికా లో ప్రారంభం కానున్న దుర్గమ్మ వారి పూజలు
"విజయవాడ కనకదుర్గ దేవస్థానం నుంచి అమ్మవారు-స్వామివారుల విగ్రహాలు, ఆభరణాలు, పూజ సామగ్రిలతో నిష్ణాతులైన నలుగురు సీనియర్ పూజారులు నిన్ననే శాన్ ఫ్రాన్సిస్కో చేరుకోవటం, ఈ వారం నుంచి అమెరికా లో 10 పట్టణాలలో దుర్గమ్మ వారి పూజలు ప్రారంభం అవుతున్నందుకు చాల సంతోషం గా వుంది. ఈ పూజారులు దేవస్థానం లో జరిగే దుర్గమ్మవారి పూజలు యథాతథంగా జరుపుతారు" అని చెన్నూరి వేంకట సుబ్బా రావు, ఎడ్వైజర్ -టెంపుల్స్ (ఎన్ ఆర్ ఐ వింగ్) ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖ, అన్నారు.
విజయవాడ దుర్గ గుడి లో ప్రధాన పూజారులు శ్రీ శంకర్ శాండిల్య మాట్లాడుతూ ఇక్కడ ప్రతి పట్టణంలోను 3 రోజుల పాటు అమ్మ వారి పూజలు వుంటాయని, కుంకుమార్చర్చన, శ్రీ చక్ర పూజ, నవ వరావరణ పూజ, లలితా సహస్ర నామ పూజ లతో పాటు శివ- పార్వతి కళ్యాణం, చండి హోమం వాటి పూజలు కూడా ఆయా గుడి ల పద్ధతులు, యాజమాన్యం ల నిర్ణయాలను బట్టి జరుగుతాయాని, తాము భక్తులకు అమ్మవారి పూజలు పూర్తి స్థాయి లో అందించటానికి సిద్ధం గా ఉన్నామని తెలిపారు.
'విజయవాడ నుంచి దుర్గమ్మ వారు ఆమెరికా రావటం, మొదటగా మా శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం, మిల్పిటాస్ పట్టణం లో జరగటం చాలక సంతోషం గా వుంది. 27-28 మే 2022 తేదీలలో దుర్గ వారి పూజలు కార్యక్రమాలు జరుగుతాయని అందరూ పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయటమే కాకుండా, దుర్గమ్మ వారి కృపకు పాత్రులు అవండి, మిగతా వివరాలలకు మా వెబ్ సైట్ www.siliconvalleytemple.net ని విజిట్ చేయండి' అని శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రెసిడెంట్ శ్రీ దయాకర్ దువ్వూరు తెలిపారు.
శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం వ్యవస్థాపక ట్రస్టీ శ్రీ మారేపల్లి నాగ వెంకట శాస్త్రి మాట్లాడుతూ' వేదా టెంపుల్ గా అందరికి తెలిసిన మా దేవాలయం అందరి మన్ననలు పొందుతూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతోంది, ఈ దుర్గమ్మ వారి పూజలు కూడా మా గుడి కి వచ్చే భక్తులకు అందించాలని ఈ కార్యక్రమం రూపొందించాము' అని అన్నారు.
అమెరికాలో దుర్గమ్మ వారి పూజల పూర్తి వివరాలకు https://telugutimes.net/news-folders/durga-pujalu-in-america చూడండి.