తానాలో మళ్ళీ ఎన్నికలు...?
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2023-25 సంవత్సరానికిగాను నిర్వహించాల్సిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యవర్గ ఎన్నికలను, ఇతర పదవులకు నిర్వహించే ఎన్నికలను వచ్చే మూడు నెలల్లోగా నిర్వహించాల్సిందిగా మేరీలాండ్ కోర్ట్ గురువారం టీఆర్ఓ (Temporary Restraining Order) ఇచ్చినట్లు వార్త. దానికితోడు ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నిరంజన్ శృంగవరపు మినహాయించి మిగతా అన్నీ పదవులకు ఎన్నికలను నిర్వహించాలని ఈ జడ్జిమెంట్లో పేర్కొన్నట్లు తెలిసింది. దానికితోడూ 2023 ఏప్రిల్ 30 నాటికి ఉన్న తానా కార్యవర్గం, బోర్డు, ఫౌండేషన్ సభ్యులు ప్రస్తుతం కూడా కొనసాగాలని, 90రోజుల్లో ఎన్నికలు జరిపి తదుపరి కార్యవర్గ సభ్యులను నియమించుకోవల్సిందిగా మేరీల్యాండ్ కోర్టు తీర్పునిచ్చినట్లు సమాచారం. మరోవైపు జూలై 10 తరువాత బోర్డ్ అంగీకారంతో చేపట్టిన నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని కూడా కోర్టు కోరింది. దీంతో ఇప్పుడు తానాలోని ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవులకు ఇతర పదవులకు మరో 90రోజుల్లో ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి కనిపిస్తోందని సమాచారం. పూర్తి జడ్జిమెంట్ 2రోజుల్లో వస్తుందని చెబుతున్నారు.