అక్కడ ఏ జెండా ఎగిరితే.. రాష్ట్రంలోనూ ఆ జెండానే
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏ జెండా ఎగిరితే.. రాష్ట్రంలోనూ ఆ జెండానే రెపరెపలాడుతుంది. ఇక్కడ గెలిచిన పార్టీయే .. అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటోంది. ఒకటి కాదు రెండు కాదు ఆరు సార్లు (1989-2014) ఇదే సంప్రదాయం కొనసాగింది. 1989లో కాంగ్రెస్ ఏలూరులో గెలవగా.. రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చింది. 1994, 99 ఎన్నికల్లో టీడీపీ 2004, 2009లో కాంగ్రెస్ అలాగే గెలిచాయి. 2014లో ఏలూరులో టీడీపీ విజయం సాధించింది. రాష్ట్రంలో అధికారం చేపట్టింది. సిటింగ్ ఎమ్మెల్యే బడేటి బుజ్జి ఈ సారి బరిలోకి దిగారు. వైసీపీ నుంచి ఆళ్ల నాని, జనసేన అభ్యర్థిగా సీనియర్ నేత రెడ్డి అప్పలనాయుడు పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాపు ఓట్లు అధికంగా ఉన్నాయి.
Tags :