హైదరాబాద్ లో క్షయవ్యాధి నిర్ధారణ కిట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్న EMPE డయాగ్నోస్టిక్స్
క్షయవ్యాధి (TB) డయాగ్నస్టిక్ కిట్‌లను తయారుచేసే గ్లోబల్ ప్రొడక్షన్ ఫెసిలిటీని హైదారాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్లు EMPE డయాగ్నోస్టిక్స్ ప్రకటించింది. జీనోమ్ వ్యాలీలో ప్రారంభించే కేంద్రంలో నెలకు 20 లక్షల టీబీ నిర్ధారణ కిట్ లను తయారుచేస్తామని కంపెనీ ప్రకటించింది. రూ. 50 కోట్ల పెట్టుబడితో 150 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలను కంపెనీ కల్పించబోతుంది. మొత్తంగా రాబోయే కాలంలో హైదరాబాద్ కేంద్రం పై 25 మిలియన్ యూరోలను పెట్టుబడిగా పెట్టే ఆలోచనలో ఉన్నామని కంపెనీ ప్రకటించింది.
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో మంత్రి కేటీఆర్ తో EMPE డయాగ్నోస్టిక్స్ వ్యవస్థాపకుడు, సిఈఓ డాక్టర్ పవన్ అసలాపురం సమావేశం తరువాత తన నిర్ణయాన్ని ప్రకటించారు.
Tags :