అమెరికా తెలుగు సంబరాల కోసం అడ్ హాక్ కమిటి ఏర్పాటు
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఇర్వింగ్‌లో మే 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలకోసం అడ్‌హాక్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ?కమిటీకి చైర్మన్‌గా శ్రీనివాస్ గుత్తికొండ వ్యవహరిస్తున్నారు. శ్రీధర్ అప్పసాని వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. శ్రీనివాస్ మంచికలపూడి (ప్రెసిడెంట్), కిషోర్ కంచర్ల (కాన్ఫరెన్స్ చైర్మన్), శ్రీనివాస్ మద్దాళి (మాజీ చైర్మన్), మోహన్ కృష్ణ మన్నవ (మాజీ చైర్మన్), మధు కొర్రపాటి (మాజీ చైర్మన్), మధు బోదపాటి (డైరెక్టర్), ప్రశాంత్ పిన్నమనేని (డైరెక్టర్), రాజేంద్ర మాదాల (కాన్ఫరెన్స్ సెక్రటరీ), శ్రీనివాసరావు కొడాలి (డైరెక్టర్), శ్రీరామచంద్రమూర్తి బడిగ (డైరెక్టర్), వంశీమోహన్ గరికపాటి (వైస్ ప్రెసిడెంట్) ఈ కమిటీలో ఉన్నారు.
Tags :