బీజేపీలో చేరిన రాపోలు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మరో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని మర్యాదపూర్వకంగా కలిశారు. తాను బీజేపీలో ఎందుకు చేర్చాల్సి వచ్చిందో వివరిస్తూ రాపోలు ఒక లేఖను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీకి సైద్ధాంతిక విధానం లేదని ఆరోపించారు. పార్టీకి సేవ చేసిన ఎంతో మంది జాతీయ నాయకులకు గౌరవం లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే వెనుకబడిన తరగతులు, చేనేత వర్గంతోపాటు తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
Tags :