ASBL Koncept Ambience

బీజేపీలో చేరిన డీకే అరుణ

బీజేపీలో చేరిన డీకే అరుణ

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు, హ్యాట్రిక్‌ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ను ఒంటి చేత్తో నడిపించడంతోపాటు జిల్లా రాజకీయాలను శాసించిన అమె పార్టీని వీడారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ చొరవతో నాటకీయ పరిణామాల చోటుచేసుకున్నాయి. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానం నుంచి అరుణ బరిలో నిలువనున్నారని తెలిసింది. అరుణ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాతో చర్చలు జరిపారు. అదిష్టానం తీసుకునే నిర్ణయం మేరకు మరోసారి చర్చలు జరిపిన తర్వాత బీజేపీ టికెట్‌పై మహబూబ్‌నగర్‌ నుంచి పోటీపై లాంఛనప్రాయ ప్రకటన వెలువడనుంది. అంతకుముందు రామ్‌మాధవ్‌ నేరుగా రంగంలోకి దిగి అరుణ నివాసాని వెళ్లి సుమారు గంట పాటు ఆమెతో చర్చలు జరిపారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని విసృష్ట హామీ ఇవ్వడంతో ఆమె ఢిల్లీ వెళ్లి అమిత్‌ షాని కలిశారు.

 

Tags :