ASBL Koncept Ambience

మహాసభల కోసం విస్తృత ప్రచారం

మహాసభల కోసం విస్తృత ప్రచారం

ప్రపంచ తెలుగు మహాసభల్లో సామాన్య సాహిత్యాభిమానులు ప్రతినిధులుగా పాల్గొనేందుకు విస్తృత ప్రచారాన్ని ప్రభుత్వం చేస్తోంది. డిసెంబర్‌ 15 నుంచి ఐదురోజుల పాటు జరిగే ఈ సభల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్‌ ద్వారా నామమాత్రపు రుసుము చెల్లించి పేర్లు నమోదు చేసుకోవచ్చు. కవులు, కళాకారులు, సాహిత్యాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నది. ప్రభుత్వం రూపొందించిన డబ్ల్యూటీసీ.తెలంగాణ.గవర్నమెంట్‌.ఇన్‌అనే వెబ్‌సైట్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు ఆన్‌లైన్‌లో రూ.100, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు రూ.500 రుసుం చెల్లించాలి. వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సిన సమాచారమంతా తెలుగులోనే ఉంటుంది. మహాసభల్లో పాల్గొనే భాషాపండితులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కూడా కల్పించారు.

Tags :