ASBL Koncept Ambience

ఫాల్కన్ ఎక్స్ ఇంక్యుబేటర్ ప్రారంభించిన నారా లోకేష్...

ఫాల్కన్ ఎక్స్ ఇంక్యుబేటర్ ప్రారంభించిన నారా లోకేష్...

ప్రతి తెలుగు వ్యక్తి ఎంట్రప్రెన్యూరర్‌ కావాలన్న చంద్రబాబు

అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్‌ శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫాల్కన్‌ ఎక్స్‌ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విదేశాంధ్రుల (ఎన్‌ఆర్‌టీలు)తో మాట్లాడారు.

ప్రతి తెలుగు వ్యక్తి ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. రాష్ట్రంలో స్టార్ట్‌పలను ప్రోత్సహించేందుకు ప్రవాసాంధ్రులు ఫాల్కన్‌ ఎక్స్‌ ఇంక్యుబేటర్‌ను ఏర్పాటుచేశారు.

రాష్ట్రాన్ని ఇన్నొవేషన్‌ వ్యాలీగా తయారుచేసేందుకు జి-10 గ్రూప్‌ ఏర్పాటుచేశానని, ఆ గ్రూపు ఆధ్వర్యంలోనే ఫాల్కన్‌ ఎక్స్‌ ఇంక్యుబేటర్‌ ప్రారంభమైందని చెప్పారు. ఏపీలో ఉన్న ప్రతి వ్యక్తీ పారిశ్రామికవేత్తగా మారేందుకు ఇది తోడ్పడాలన్నారు. రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నామని,, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఫైబర్‌నెట్‌ ఏర్పాటుచేశామని తెలిపారు. వ్యవసాయంలో టెక్నాలజీ వినియోగం ద్వారా రెండంకెల వద్ధి సాధించామన్నారు. ఎన్నారైలంతా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.

గ్రామాల అభివృద్ధికి టెక్నాలజీ ఉపయోగపడాలని, ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని లోకే ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఒక స్టార్టప్‌ కంపెనీలా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్‌ కంపెనీలకు దన్నుగా నిలిచి.. సిలికాన్‌ వ్యాలీలో కంపెనీలు ఏర్పాటుచేసేలా ఫాల్కన్‌ ఎక్స్‌ పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. అదేవిధంగా అమెరికాలో ఉన్న ఎన్‌ఆర్‌ఐలు, స్టార్టప్‌ కంపెనీలు ఏపీకి తరలివచ్చేందుకు ఇది వేదిక అవుతుందన్నారు.

'అభివృద్ధి వికేంద్రీకరణ లక్ష్యంతో ఐటీ రంగం ఒకే చోట కాకుండా విశాఖ, అనంతపురం, తిరుపతి, అమరావతిల్లో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. బ్లాక్‌చైన్‌, ఫిన్‌టెక్‌ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. రాజధాని ప్రాంతంలో భూ రికార్డులన్నీ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ వేదికపైకి తీసుకొస్తున్నాం. దీనివల్ల రైతులు రుణాలు తీసుకోవడం సులభమవుతుంది' అని వీఎంవేర్‌ సీవోవో రఘురాంతో భేటీ సందర్భంగా లోకేశ్‌ తెలిపారు. బ్లాక్‌చైన్‌ ఓపెన్‌ సోర్స్‌ టెక్నాలజీపై పనిచేస్తున్నామని, దీనిపై ఏపీతో కలిసి పనిచేసేందుకు త్వరలోనే తమ బందాన్ని పంపిస్తామని రఘురాం పేర్కొన్నారు. అనంతరం స్పార్క్‌ ల్యాబ్స్‌ వ్యవస్థాపకుడు బెర్నార్డ్‌ మూన్‌ను లోకేశ్‌ కలిశారు. యాసిలిరేటర్‌ ప్లాట్‌ఫాం ద్వారా స్టార్టప్‌ కంపెనీల అభివ ద్ధికి ఈ కంపెనీ ప్రోత్సాహమిస్తోంది. టెక్నాలజీలో నవ్యాంధ్ర అందరికంటే ముందుందని, కలిసి పనిచేసేందుకు సిద్ధమని మూన్‌ తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ సెక్యూరిటీల్లో సేవలందిస్తున్న కలర్‌ టోకెన్స్‌ కంపెనీ ఉపాధ్యక్షుడు రాజేశ్‌ కాజాంచి, క్లౌడ్‌ లెండింగ్‌ సొల్యూషన్స్‌ ప్రతినిధి స్నేహల్‌, అరిస్తా కంపెనీ చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ అన్షుల్‌ కూడా రాష్ట్రానికి వచ్చి తమ కంపెనీల ఏర్పాటు అవకాశాలను పరిశీలిస్తామన్నారు.

Click here for Event Gallery

 

Tags :