సీఎం పదవి కోసం రూ.1500 కోట్లతో జగన్ బేరం
తనను ముఖ్యమంత్రి చేస్తే కాంగ్రెస్‌కు రూ.1500 కోట్లు ఇచ్చేందుకు సిద్దమని జగన్ చెప్పారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఆనాడు జగన్ తనకు చెప్పిన మాట ఇప్పటికీ గుర్తుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మద్దతుగా కడప ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డబ్బులతో ఏదైనా జరుగుతుందని జగన్ అనుకుంటారని, జగన్‌కు అంత సొమ్ము ఎక్కడ నుంచి వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్ గురించి, రాష్ట్రం గురించి ఆలోచించే నాయకుడని ఆయన కొనియాడారు. ఈ ఇద్దరికి ఉన్న తేడా తనకు సృష్టంగా తెలుస్తోందని, ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు అద్భుతమైన కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు. నదుల అనుసంధానం వంటి విధానాలు చాలా అద్భుతమని తెలిపారు. మనం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఏం తింటున్నా.. మనం భారతీయులమని అన్నారు. దేశమంతా ఒక్కటేనని. కానీ ప్రాంతాల వారీగా ..మతాలవారీగా.. రాజకీయాలు చేయాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాంటి వారిని తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.