ASBL Koncept Ambience

ఎపి ప్రగతికి చేయూతనివ్వండి - జయరామ్ కోమటి

ఎపి ప్రగతికి చేయూతనివ్వండి - జయరామ్ కోమటి

ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపథంలోకి తీసుకెళ్ళేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి మద్దతుగా ఎన్నారైలు కూడా తోడ్పాటును అందించాలని అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రతినిధి జయరామ్‌ కోమటి కోరారు. చికాగోలో శుక్రవారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ ప్రముఖులు వినోజ్‌ చనుమోలు, హేమ కానూరు తదితరులు ఆయనను ఘనంగా సన్మానించారు. నవ్యాంధ్ర ప్రదేశ్‌ నిర్మాణం ఒక్కరివల్ల అయ్యే పని కాదని, అందరూ కలిసి సమైక్యంగా చేయూతను అందిస్తే అనతికాలంలోనే రాష్ట్రం అభివృద్ధిని సాగించగలదని జయరామ్‌ కోమటి చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా నాయకులు జంపాల చౌదరి, యుగంధర్‌, గంగాధర్‌ నాదెళ్ళ, సతీష్‌ వేమన తదితరులు పాల్గొన్నారు. 

Click here for Event Gallery

 

Tags :