ASBL Koncept Ambience

డిట్రాయిట్ లో ఘనంగా జయరామ్ అభినందన సభ

డిట్రాయిట్ లో ఘనంగా జయరామ్ అభినందన సభ

డిట్రాయిట్‌లో ఎపి ప్రభుత్వ ప్రతినిధిగా నియమతులైన జయరామ్‌ కోమటి సన్మాన సభను డిట్రాయిట్‌ తెలుగువాళ్ళు ఘనంగా నిర్వహించారు. ఫార్మింగ్టన్‌ హిల్స్‌లో జరిగిన ఈ సన్మాన సభకు ఎంతోమంది తెలుగు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమైన బాధ్యతలను ఉంచారని, ఆ బాధ్యతల్లో నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కూడా ఉందని చెప్పారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి అందరూ కలిసిరావాలని కోరారు. డిట్రాయిట్‌ తెలుగువాళ్ళు తెలివైనవారని, దేశాభివృద్ధికి కంకణం కట్టుకున్నవారని జయరామ్‌ కోమటి తన ప్రసంగంలో ప్రశంసించారు.

తానా మాజీ అధ్యక్షుడు గంగాధర్‌ నాదెళ్ళ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో తానా నాయకులు పలువురు పాల్గొన్నారు. అధికార ప్రతినిధి అంటే కేవలం ప్రభుత్వ మంత్రులు, అధికారుల పర్యటనలు సమన్వయపరచటమే కాదని, నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం, రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్ళడం వంటివి తన భుజస్కందాలపై ముఖ్యమంత్రి ఉంచారని, ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీ అందరి సహకారంతో ముందుకెళ్ళగలనన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ సతీష్‌ వేమన, హేమప్రసాద్‌ యడ్ల, శ్రీనివాస్‌ గోగినేని, కృష్ణప్రసాద్‌ కాట్రగడ్డ, సునీల్‌ పంత్ర, హనుమయ్య బండ్ల, అశోక్‌ బాబు కొల్లా, రాజా సూరపనేని, సతీష్‌ వేమూరి, నవీన్‌ ఎర్నేని, నిరంజన్‌ శృంగవరపు, కిరణ్‌ చౌదరి, మోహన్‌ కోనేరు, శివ పోలవరపు, రమేష్‌ పెద్దేటి, హర్ష, శివరాం యార్లగడ్డ తదితరులతోపాటు డిట్రాయిట్‌ ప్రముఖులు పాల్గొన్నారు. 


Click here for Event Gallery

 

Tags :