ASBL Koncept Ambience

ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్ లో రూ. 500 కోట్లతో విస్తరణ

ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్ లో రూ. 500 కోట్లతో విస్తరణ

భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు స్విట్జర్లాండ్ కు చెందిన ఫార్మా కంపెనీ ఫెర్రింగ్ ఫార్మా ప్రకటించింది. మంత్రి కేటీఆర్ తో దావోస్ లోని తెలంగాణ పెవిలియన్ లో ఫెర్రింగ్ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు అలెశాండ్రో గిలియో (Mr. Alessandro Gilio) ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది.

ఫెర్రింగ్ ఫార్మా హైదరాబాద్ లో రూ. 500 కోట్లతో తన విస్తరణ ప్రణాళికలు ప్రకటించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేవలం నెలరోజుల క్రితమే కంపెనీ యూనిట్ ను హైదరాబాద్ లో ప్రారంభించానని, ఇంత త్వరగా కంపెనీ అదనంగా మరో 60 మిలియన్ల యూరోల పెట్టుబడిగా పెట్టడం తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలకు నిదర్శనమన్నారు. కేవలం దేశీయ కంపెనీలకే కాకుండా అంతర్జాతీయ విదేశీ కంపెనీలకు సైతం తెలంగాణ అత్యంత అనుకూలంగా ఉందనే విషయాన్ని ఈ పెట్టుబడి ప్రకటన నిరూపిస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాపార, వాణిజ్య, ఉపాధి కల్పన అనుకూల కార్యక్రమాల వల్లనే ఇది సాధ్యమైందని కేటీఆర్ అన్నారు. తెలంగాణలో తన విస్తరణకు పెట్టుబడి పెడుతున్న ఫెర్రింగ్ ఫార్మా కి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.

 

Tags :