ASBL Koncept Ambience

ఇవాంక ట్రంప్‍ ధరించిన డ్రెస్‍ ఖరీదు ఎంతో తెలుసా?

ఇవాంక ట్రంప్‍ ధరించిన డ్రెస్‍ ఖరీదు ఎంతో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ కుమార్తె ఇవాంక ట్రంప్‍ అహ్మదాబాద్‍ నగరంలో సందడి చేశారు. మొతెరా స్టేడియంలో నిర్వహించిన నమస్తే ట్రంప్‍ కార్యక్రమంలో ఆమె భర్త జారెడ్‍ కుష్నర్‍, అమెరికా ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. అధ్యక్షుడి సలహాదారు అయిన ఇవాంక రంగు రంగుల పూలతో తయారు చేసిన మిడ్డీ డ్రెస్‍ ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె వేసుకున్న డ్రెస్‍కు పెట్టిన ఖర్చు గురించి జాతీయ మీడియాలో వార్తలు వెలువడ్డాయి. ఆమె విమానం దిగిన దగ్గర నుంచి తీసిన ఫొటోలు సోషల్‍ మీడియాలో వైరల్‍గా మారాయి. ఇవాంక ధరించిన డ్రెస్‍ భారత కరెన్సీలో రూ.1.7 లక్షలు కావడం విశేషం. గతంలో 2019లో అర్జెంటీనా వెళ్లినప్పుడు చివరిసారిగా ఆమె ఈ డ్రెస్‍ ధరించారు. స్టన్నింగ్‍ ఔట్‍ఫిట్‍తో వచ్చిన ఇవాంక స్టేడియంలో సెల్ఫీలు దిగుతూ ఉత్సాహంగా కనిపించారు. ఇవాంకా భారత్‍కు రావడం ఇది రెండోసారి. రెండేళ్ల క్రితం హైదరాబాద్‍లో జరిగిన గ్లోబల్‍ ఎంటర్‍ప్రెన్యూయర్‍ సమ్మిట్‍లో ప్రధాని నరేంద్ర మోదీ, మంత్రి కేటీఆర్‍తో కలిసి పాల్గొన్న విషయం తెలిసిందే.

 

Tags :