ASBL Koncept Ambience

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి  మరో షాక్

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. మాజీ మంత్రి, మెదక్‌ డీసీసీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఆమె కలిశారు. పార్టీ మారే అంశంపై కేటీఆర్‌తో ఆమె చర్చించారు. ఏప్రిల్‌ మొదటి వారంలో నర్సాపూర్‌లో జరిగే సీఎం కేసీఆర్‌ సభలో సునీతా లక్ష్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్‌ పార్టీలో సునీతకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

 

Tags :