ASBL Koncept Ambience

బీజేపీలో చేరిన అందాల తార

బీజేపీలో చేరిన అందాల తార

ఒకప్పటి అందాల తార జయప్రద బీజేపీ తీర్థం పుచ్చుకుంది. గతంలో పలు పార్టీలకి పని చేసిన జయప్రద ఎంపీగా కూడా పని చేశారు. తాజాగా ఆమె బీజేపీ కండువా కప్పుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని రామ్‌పుర్‌ నియోజక వర్గం నుంచి తాను పోటీ చేయనున్నట్టు తెలుస్తుంది. ఎస్పీ నాయకుడు ఆజంఖాన్‌పై జయప్రద పోటీ చేసే చాన్సుంది. ఈ రాంపూర్‌ నుంచి 2014లో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ నేపాల్‌ సింగ్‌ విజయం సాధించారు. 2004 నుంచి 2014 వరకు ఇదే నియోజకవర్గం నుంచి ఎస్పీ తరపున జయప్రద ఎంపీగా కొనసాగారు. ఇప్పుడీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆజంఖాన్‌పై గతంలో ఆమె ఘాటైన వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయనను చూస్తుంటే అల్లావుద్దీన్‌ ఖిల్జీ గుర్తొస్తున్నాడని ఆమె అన్నారు.

 

Tags :