నరేన్ కొడాలి వర్గానికి తానా మాజీ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని మద్దతు
తానా ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా, కమ్యూనిటికి సేవే లక్ష్యంగా ముందుకెళుతున్న నరేన్ కొడాలి వర్గానికి అనుకోని విధంగా తానా మాజీ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని బహిరంగంగా తన మద్దతును ప్రకటించారు. నేడు అమెరికాలో పాపులర్ గా ఉన్న తానా టీమ్ స్క్వేర్ విభాగాన్ని మోహన్ నన్నపనేని తన హయాంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ టీమ్ స్క్వేర్ విభాగం ఆపదలో ఉన్న తెలుగువారికి సహాయాన్ని అందిస్తూ వస్తోంది. ఈ విభాగం ఏర్పాటు ద్వారా తానాపై తనదైన ముద్ర వేసుకున్న మోహన్ నన్నపనేనికి తానాలో మంచి ఇమేజ్ ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు నరేన్ కొడాలి వర్గానికి ఆయన మద్దతు మరింత ఊపునిస్తుందనడంలో సందేహం లేదు. తానా అధ్యక్షునిగా తాను ఉన్నప్పుడు నరేన్ కొడాలితో కలిసి పనిచేసిన అనుభవాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు తానాను రివైవ్ చేయాల్సిన అవసరం ఏర్పడిరదని ఇప్పుడు తానాకు నరేన్ కొడాలి, ఆయన టీమ్ నాయకత్వం వహిస్తేనే బావుంటుందని మోహన్ నన్నపనేని అంటూ, తాను ఆ టీమ్‌కు బహిరంగంగా మద్దతును ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో న్యూఇంగ్లాండ్ రీజినల్ రిప్రజెంటేటివ్ పదవికి పోటీ చేస్తున్న కృష్ణ ప్రసాద్ సోంపల్లికి, కార్యదర్శి పదవికి పోటీ చేస్తున్న రాజా కసుకుర్తికి, ఫౌండేషన్ ట్రస్టీగా పోటీ చేస్తున్న శ్రీనివాసరావు ఎండూరికి కూడా మోహన్ నన్నపనేని మద్దతును ప్రకటించారు.