తానా కాన్ఫరెన్స్ కోసం ఫిలడెల్ఫియా చేరుకున్న వెంకయ్య నాయుడు
తానా మహాసభల కోసం మాజీ భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎప్పటి నుంచో తన మనసులో ఉన్న కోరికలను వెంకయ్య నాయుడు తీర్చుకున్నారు. ఆయనకు ఎప్పటి నుంచో న్యూయార్క్‌లోని హోటల్ తాజ్‌లో ఉండాలని కోరిక ఉందట. అందుకే తానా సభల కోసం అమెరికా వచ్చిన ఆయన ఒక రాత్రి అక్కడే బస చేశారు. ఆయన్ను న్యూయార్క్ విమానాశ్రయంలో తానా ఓవర్సీస్ కో-ఆర్డినేటర్ వంశీ కోట రిసీవ్ చేసుకున్నారు. తన ఇంట్లోనే వెంకయ్య నాయుడు గారికి డిన్నర్ ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే అమెరికాలో ట్రైన్ జర్నీ చేయాలని కూడా వెంకయ్య నాయుడుకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. దీన్ని కూడా ఆయన తీర్చేసుకున్నారు. న్యూజెర్సీలో రైలు ఎక్కి ఫిలడెల్ఫియా వరకు రైలు ప్రయాణం చేశారు. ఎడిసన్ స్టేషన్ నుంచి డౌన్‌టౌన్ 30వ స్ట్రీట్ స్టేషన్ వరకు రైలులో వచ్చారు. ఆయనకు రైల్వే స్టేషన్‌లో తానా కాన్ఫరెన్స్ కన్వీనర్ రవిపొట్లూరి, ఇతర తానా నాయకులు స్వాగతం పలికారు.