దావోస్ సదస్సులో ఎంపీ గల్లా జయదేవ్, మంత్రి కేటీఆర్... కీలక చర్చ
తెలుగుదేశం పార్టీ యువ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో బిజీబిజీగా గడుపుతున్నారు. అమరరాజా బ్యాటరీస్ అధినేత హోదాలో దావోస్ సదస్సుకు హాజరైన గల్లా జయదేవ్, ఇదివరకే కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పురితో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో పాలుపంచుకున్న సంగతి విదితమే. తాజాగా తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో కలిసి జయ దేవ్ మరో కీలక చర్చలో పాలుపంచుకున్నారు. ఇండియాస్ గ్రోత్ స్టోరీ పేరిట సిఎన్జీసి టివి 18 నిర్వహించిన ఈ చర్చా వేదికలో కేటీఆర్ సహా తెలుగు నేలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త శోభనా కామినేని, భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్తలు సంజీవ్ బజాజ్, అశిష్ షాలతో కలిసి గల్లా జయదేవ్ పాల్గొన్నారు.
Tags :