వర్జీనియాలో మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యటన
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగం అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతుల ఏర్పాటు వంటి అంశాలపై అమెరికాలోని ఎన్నారైలతో, విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమవుతున్న రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారంనాడు వర్జీనియాలోని జార్జిమేసన్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం అధికారులతో సమావేశమై అక్కడి బోధనా పద్ధతుల గురించి తెలుసుకున్నారు. వాషింగ్టన్‌లో ఉన్న డిసి పబ్లిక్ ఛార్టర్ స్కూల్ ఆఫ్ బోర్డ్‌ను కూడా మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, తానా నాయకులు నాదెళ్ళ గంగాధర్, సతీష్ వేమన, ప్రొఫెసర్ డాక్టర్ మూల్పూరి వెంకటరావు, పాతూరి నాగభూషణం, మోహన్ వెనిగళ్ళ, ధర్మప్రచారక్ తదితరులు పాల్గొన్నారు.
Tags :