ASBL Koncept Ambience

పాఠశాల" బోధనను ప్రశంసించిన గంటా శ్రీనివాసరావు

పాఠశాల" బోధనను ప్రశంసించిన గంటా శ్రీనివాసరావు

అమెరికాలోని మన చిన్నారులకు తెలుగు భాషను సులభంగా నేర్పిస్తున్న 'పాఠశాల'కు సంబంధించిన వివరాలు మరింత మందికి తెలియజేసేందు కోసం అమెరికా తెలుగు సంఘం (ఆటా) సిల్వర్‌ జూబ్లి వేడుకల్లో 'పాఠశాల' స్టాల్‌ను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టాల్‌ను సందర్శించి తెలుగు భాషను చిన్నారులకు సరళంగా నేర్పుతూ, తెలుగు భాష పరిరక్షణకు కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు.

పాఠశాల డైరెక్టర్‌ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 'పాఠశాల'కు గుర్తింపు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, పాఠశాల ఇక్కడి చిన్నారులకు తగ్గట్టుగా తెలుగు భాషను సులభంగా, సరళంగా నేర్పిస్తోందన్నారు. అలాగే ప్రత్యేకత ఇ-లెర్నింగ్‌ అని ఇంట్లో కూడా తెలుగు భాషను నేర్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా ఇప్పుడు ఇ-లెర్నింగ్‌ను చూడవచ్చని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు రాష్ట్ర స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ శ్రీమతి సంధ్యరాణి కూడా స్టాల్‌ను సందర్శించారు.

 

Tags :