గేటెడ్ కమ్యూనిటీలవైపే అందరి చూపు
హైదరాబాద్ మహా నగరాభివద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం అంతర్జాతీయ ప్రమాణాలతో దూసుకుపోతున్నది. ముఖ్యంగా రాజధాని మణిహారమైన ఔటర్ రింగ్‌రోడ్డు వెంట వెలుస్తున్న గేటెడ్ కమ్యూనిటీలతో నూతన కళను సంతరించుకుంటున్నది. భద్రత, ప్రకతి వాతావరణం, మెరుగైన ప్రజా రవాణాల దష్ట్యా గేటెడ్ కమ్యూనిటీల వైపు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో హంగులు ఇతరత్రా కాకుండా భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తున్నారు. మొన్నటి వరకు అపార్టుమెంట్లు, ఇండిపెండెంట్ హౌస్‌ల చుట్టూ తిరిగిన వాళ్లు గేటెడ్ కమ్యూనిటీలకు ఇప్పుడు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అపార్టుమెంట్లలో చుట్టూ మనుషులు ఉన్న పండుగలకు, సెలవులకి తప్ప ఎవరూ కలిసే అవకాశం ఉండదు. కానీ గేటెడ్ కమ్యూనిటీలో అలా ఉండదు. దీంతో వీటిలో ఉండేందుకే ఆసక్తి కనబర్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే గడిచిన మూడేళ్లలో ఔటర్ వెంట 31 చోట్ల గేటెడ్ కమ్యూనిటీల ఏర్పాటు చేస్తూ రియల్టర్లు ముందుకు వచ్చారు. దీనినిబట్టి వీటికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
నార్త్ ఇండియన్ప్, ఉన్నతవర్గాలు, ఐటీ ఉద్యోగులు, ప్రవాస భారతీయులు గేటెడ్ కమ్యూనిటీల వైపు దష్టి సారిస్తున్న తరుణంలో రియల్టర్లు ఔటర్ వెంట నిర్మాణాల జోరును పెంచారు. పిల్లలు ఆడుకోవడం దగ్గర నుంచి పెద్ద వాళ్లు కాలక్షేపం చేసే వరకు అన్ని సౌకర్యాలు ఇందులో కల్పిస్తుండడంతో కొనుగోలు చేసే వారీ సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. సేఫ్టీ, ఎన్విరాల్‌మెంట్, ఎమ్యూనిటీస్ ఉంటుండడంతో ధర కొంచెం ఎక్కువే అయినా ఇదే బెటర్ అంటున్నవారే ఎక్కువగా ఉంటున్నారు. స్విమ్మింగ్ ఫూల్, టెన్నిస్, ఆట స్థలాలు, ఇరుగుపొరుగు కలిసి మెలిసి ఉండే వాతావరణం, వాలీబాల్ నుంచి బాస్కెల్‌బాల్, క్లబ్ హౌస్, లైబ్రరీ, జిమ్, మినీ థియేటర్లు ఇలా అన్ని సౌకర్యాలను ఈ గేటెడ్ కమ్యూనిటీలో దొరుకుతుండడంతో ఆరోగ్యకరమైన వాతావరణానికి సై అంటుండడం గమనార్హం.
ఆమీన్‌పూర్, దూలపల్లి, బాచుపల్లి, మోఖిల, గుండ్లపోచంపల్లి, ఉస్మాన్ నగర్, కోకాపేట, బాచుపల్లి, శ్రీనగర్, కిష్ణారెడ్డి పేట, నెక్నాంపూర్, ఆదిబట్ల, గండిపేట, కొల్లూరు, కిస్మత్‌పూర్, బండ్లగూడ, బౌరంపేట, మల్లంపేట, శంకర్‌పల్లి ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల లుక్ సంతరించుకుంది. గడిచిన మూడేళ్లలో 31 ప్రాంతాల్లో రియల్టర్లు హెచ్‌ఎండీఏకు దరఖాస్తులు చేసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఒక్కో వెంచర్‌లో 100 లోపు ప్లాట్లు ఉండే లా ..అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ నగర వాసుల నుంచి ఆదరణ పొందుతున్నారు. ముఖ్యంగా రూ. 50 లక్షల నుంచి మూడు కోట్ల వరకు అందుబాటులో తీసుకువస్తున్నారు.