ASBL Koncept Ambience

మోదీకి అరుదైన గౌరవం

మోదీకి అరుదైన గౌరవం

మహాత్మాగాంధీ 150 జయంత్యుత్సవాలను జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. బిల్‌ అండ్‌ మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రతీ ఏడాది ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్‌ గోల్‌ కీపర్‌ అవార్డు మోదీకి దక్కింది. భారత్‌ను పరిశుభ్రంగా ఉంచడానికి మోదీ సర్కార్‌ చేపట్టిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ ఐక్యరాజ్య సమితి విధించిన లక్ష్యాలను చేరుకోవడంతో ఈ అవార్డు ఇస్తున్నట్టు గేట్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది. న్యూయ్కార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గేట్స్‌ ఫౌండేషన్‌ అధినేత బిల్‌ గేట్స్‌ ఈ అవార్డును మోదీకి ప్రదానం చేశారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో ఈ అవార్డు రావడం వ్యక్తిగతంగా నాకెంతో ప్రత్యేకం అని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

 

 

Tags :