హైదరాబాద్‌లో జెడ్ఎఫ్ సంస్థ మొబిలిటీ కేంద్రం
హైదరాబాద్‌లో జర్మనీకి చెందిన జెడ్‌ఎఫ్ సంస్థ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ప్రతినిధులు సమావేశమై విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో కొత్త మొబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ మొబిలిటీ కేంద్రాన్ని జూన్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. 3వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ విస్తరణ ప్రణాళికలను చేపట్టనుంది. ప్రపంచంలో 100 ఏరియాల్లో 18 మేజర్ డెవలప్‌మెంట్ సెంటర్లలో తమ కార్యకలాపాలను జెడ్‌ఎఫ్ సంస్థ కొనసాగిస్తోంది. జెడ్‌ఎఫ్ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Tags :