గిరిధారి నుంచి మరో ప్రాజెక్టు
తెలంగాణ రాష్ట్రంలో గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు మంచి పేరు ఉంది. ఎన్నో వెంచర్లను విజయవంతంగా చేసిన ఈ కంపెనీ ప్రస్తుతం బెంగళూరు జాతీయ రహదారి మీద వేదాంత, గ్రీన్ కౌంటీ, వికారాబాద్ లో నిర్వానా అనే గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లను ప్రారంభించింది.
మహబూబ్‌నగర్‌లో పోలెపల్లి ఎస్‌ఈజెడ్, దివిటిపల్లి ఐటీ హబ్‌లను దష్టిలో పెట్టుకుని 26 ఎకరాల్లో 'వేదాంత' అనే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ వెంచర్‌కు గిరిధారి కన్‌స్ట్రక్షన్స్ శ్రీకారం చుట్టింది. భూత్పూర్ మున్సిపాలిటీలో గల అమిస్తాన్‌పూర్ వద్ద 'గ్రీన్ కౌంటీ' అనే ప్రాజెక్టును ఆరంభించింది. ఇక, హైదరాబాద్ నుంచి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో గల వికారాబాద్‌లో 'నిర్వానా' విల్లా ప్లాట్ల ప్రాజెక్టును మొదలెట్టింది. డీటీసీపీ అనుమతితో దాదాపు పన్నెండు ఎకరాల్లో అభివద్ధి చేస్తున్న ఈ వెంచర్‌లో ప్లాటు సైజు 160 గజాల నుంచి ప్రారంభమవుతుంది. హండ్రెడ్ పర్సంట్ వాస్తుకు అనుగుణంగా డెవలప్ చేస్తున్న విల్లా ప్రీమియం ప్లాట్లలో అంతర్గత రహదారులన్నీ 40 అడుగులవి కావడం గమనార్హం. ఇందులో ప్లాటు కొనుక్కుంటే ఎంచక్కా మీకు నచ్చినట్టు విల్లా కూడా కట్టుకోవచ్చు.
ఇతర వివరాలకోసం కంపెనీ వెబ్‌సైట్‌ను చూడండి.
https://giridhariconstructions.com/our-projects/