ASBL Koncept Ambience

అట్లాంటాలో వైభవంగా జిటిఎ బతుకమ్మ వేడుకలు

అట్లాంటాలో వైభవంగా జిటిఎ బతుకమ్మ వేడుకలు

గ్లోబల్‌ తెలంగాణ అసోసీయేషన్‌(జీటీఏ) ఆధ్వర్యంలో అట్లాంటా దద్దరిల్లేలా తెలంగాణ గర్వపడేలా బతుకమ్మ సంబరాలు జరిగాయి. మునుపెన్నడూ లేని విధంగా సుమారు 5 వేలకు పైగా విచ్చేసిన అతిథులతో డెన్‌మార్క్‌ హైస్కూల్‌ కిటకిటలాడింది. జీటీఏ ప్రతిపాదన మేరకు బతుకమ్మ పండుగను గుర్తిస్తూ జార్జియా రాష్ట్ర అధ్యక్షులు గవర్నర్‌ కెంపు ప్రతినిధుల అధికారిక ప్రకటన ఈ సంబరాల్లో విశిష్ఠ అంశంగా నిలిచింది. పలు స్వచ్ఛంద సేవా కార్య్రమాలలో అత్యద్భుత సహకారం అందిస్తున్న వీటీ సేవ సంస్థకు సహకరిస్తూ నిర్వహించనున్న పలు సేవా కార్యక్రమాలను ప్రకటించింది. 

విశిష్ఠ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున విచ్చేసిన ప్రకాష్‌ జీటీఏ కార్య నిర్వహణా సామర్ధ్య పటిమను కొనియాడారు. స్టేట్‌ ఆఫ్‌ జార్జియా, సిటీ ఆఫ్‌ జాన్స్‌ క్రీక్‌ ప్రముఖులు విచ్చేయగా ఈ వేదికపై మెడిటేషన్‌ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ముస్తాబయిన ఎత్తైన కళాత్మక బతుకమ్మలు అందరినీ అబ్బుర పరుచగా, పరికినీలు పట్టు పంచెలు, పట్టు చీరలు, పలుకరింపుల కోలాహలంతో బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసిన ఆత్మీయ అతిథులతో కన్నుల పండుగలా అలరించింది జీటీఏ బతుకమ్మ సంబరం. ఆకట్టుకునేలా విభిన్న విక్రయదారుల కోలాహలం, ఘుమఘుమలాడే విందు, సాంస్కృతిక వినోదం, అనురాగ పూరిత ఆతిథ్యం, పిల్లల కేరింతలు, నారీమణుల ఉత్తేజ భరిత బతుకమ్మ ఆటల వాతావరణంతో అందరినీ మంత్రముగ్ధుల్ని గావించింది. నిర్విరామంగా సుమారు 8 గంటలకు పైగా జీటీఏ బతుకమ్మ సంబరం సాగింది. బతుకమ్మ పోటీలలో పాల్గొన్న ఆడపడుచులకి , గ్లోబల్‌ తెలంగాణ అసోసీయేషన్‌ కోర్‌ టీం సభ్యులకు, అతిథులకు, సహాయ సహకారకులకు, ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన ఇతర సంస్థల కార్యవర్గ బృందానికి, స్పాన్సర్లకు నిర్వాహకులు హృదయ పూర్వకంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

 

Click here for Event Gallery

 

 

Tags :