ASBL Koncept Ambience

హైద‌రాబాద్‌లో 37 ల‌క్ష‌ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టనున్న జిఎంఎం ఫాడులర్

హైద‌రాబాద్‌లో 37 ల‌క్ష‌ల డాల‌ర్ల పెట్టుబ‌డి పెట్టనున్న జిఎంఎం ఫాడులర్

అంతర్జాతీయ కంపెనీ జిఎంఎం ఫాడులర్ హైదరాబాద్ లో తన తయారీ కేంద్రాన్ని భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఫార్మా కంపెనీలకు అవసరమయ్యే గ్లాస్ రియాక్టర్, ట్యాంక్, కాలమ్ లను తయారు చేసే జిఎంఎం ఫాడులర్ హైదరాబాద్ తయారీ కేంద్రంపై అదనంగా 3.7 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టబోతుంది. GMM Pfaudler-ఇంటర్నేషనల్ బిజినెస్ సిఈఓ - థామస్ కెహ్ల్ , వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, దావోస్ డైరెక్టర్- అశోక్ జె పటేల్ లు మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యి తమ విస్తరణ ప్రణాళికలను వివరించారు. తమ వ్యాపార ప్రణాళికల్లో హైదరాబాద్ కే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రాజెక్టులోనూ భాగస్వామిగా ఉండడానికి జిఎంఎం ఫాడులర్ ఆసక్తిని వ్యక్తం చేసింది.

గ్లాస్ లైనింగ్ పరికరాల ఉత్పత్తి కోసం రెండు సంవత్సరాల క్రితం (2020) 6.3 మిలియన్ డాలర్లతో హైదరాబాద్ లో జిఎంఎం ఫాడులర్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. అయితే అంతర్జాతీయంగా పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తిని పెంచాలనుకున్న కంపెనీ అదనంగా మరో 37 లక్షల డాలర్లతో విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. తాజా నిర్ణయంతో కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 300 కు చేరుతుంది. అక్టోబర్ 2020 - మార్చి 2022 మధ్య కాలంలో కంపెనీ హైదరాబాద్ కేంద్రం 700 పరికరాలను వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.

 

Tags :