గోదావరి జిల్లా ఎన్నారైల సమావేశం
వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఇ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 22వ మహాసభల్లో భాగంగా శనివారంనాడు గోదావరి జిల్లాల ఎన్నారైల సమావేశం జరిగింది. గోదావరి ప్రవాసుల సంఘం వ్యవస్థాపక సభ్యులు యంత్ర సుబ్బా సంస్థ లక్ష్యాలను, ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు.
తానా నాయకుడు జే తాళ్ళూరి మాట్లాడుతూ తనకు కాకినాడలో సంస్థ విభాగం ఉందని, తన వదిన ది గోదావరి జిల్లా అని తెలిపారు. వెటకారం-చమత్కారం-మమకారం గోదారి జిల్లాల వాళ్ల బలమని జయశేఖర్ పేర్కొన్నారు. తెలంగాణాలో పేరు పెట్టి పిలుస్తారని, గోదావరి వెళ్తే అరేయి ఒరేయి తప్ప వేరే ఆప్యాయత కనపడదని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గన్ని కృష్ణను. జే తాళ్ళూరిని నిర్వాహకులు మన్నే సత్యనారాయణ, పుసులూరి సుమంత్, చిలుకూరి రాంప్రసాద్, మేకా సతీష్ తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో డా.రాజా తాళ్లూరి, లావు అంజయ్య చౌదరి, డా.జంపాల చౌదరి తదితరులు పాల్గొన్నారు.