ASBL Koncept Ambience

సాహిత్య కమిటీ సమావేశాలకు మంచి స్పందన

సాహిత్య కమిటీ సమావేశాలకు మంచి స్పందన

వాషింగ్టన్‌ డీసీలోని వాల్టర్‌ ఇ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరుగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 22వ మహాసభల్లో సాహిత్య కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన సాహిత్య సమావేశాలకు మంచి స్పందన వచ్చింది. ప్రముఖ కవులు, రచయితలు ఎందరో ఈ సమావేశంలో పాల్గొని తమకు అప్పగించిన అంశాలపై ప్రసంగించారు. జొన్నవిత్తుల, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మేడసాని మోహన్‌, పారుపల్లి కోదండరామయ్య, లెనిన్‌, జంపాల చౌదరి, వాసిరెడ్డి నవీన్‌, కె. మల్లీశ్వరి, డా. వాణీకుమారి తుమ్మలపల్లి, డా. లక్ష్మీ గోపరాజు తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. 

Tags :