నాటక అకాడమీ ఛైర్మన్ గా గోపాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ ఛైర్మన్‌గా గుమ్మడి గోపాలకృష్ణను నియమిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. మహానాడు రెండోరోజు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ ప్రకటన చేశారు. గోపాలకృష్ణ ఎన్టీఆర్‌పై పద్యం పాడి అందరినీ అలరించారు.
గోపాలకృష్ణ పార్టీ కార్యక్రమాలను నాటకాలు, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మరో కార్యకర్త వడ్డెర రామును రాష్ట్ర పర్యాటకశాఖ సంచాలకుడిగా నియమించారు. మరో కార్యకర్త పాలడుగు రామారావు పార్టీ కార్యక్రమాల ప్రచారానికి సైకిల్‌పై యాత్రలు చేశారని.. అసంపూర్తిగా ఉన్న ఆయన ఇంటి నిర్మాణానికి రూ.10లక్షలు పార్టీ విరాళంగా అందజేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
Tags :