ఘనంగా ముగిసిన తానా మహాసభలు
సెయింట్‌లూయిస్‌లోని అమెరికా సెంటర్‌లో మే 26 నుంచి 28వ తేదీ వరకు 3రోజులపాటు జరిగిన మహాసభలు ఘనంగా ముగిశాయి. మహాసభల చివరిరోజున వేలాదిమంది సమక్షంలో తానా కొత్త కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. చివరిరోజున క్యూరీ లెర్నింగ్ విజేతలకు పురస్కారాలు, చేనేత వస్త్రాల ఫ్యాషన్ షో, ఆకాష్ స్పెల్లింగ్ బీ ప్రతిభా ప్రదర్శన వంటివి జరిగాయి. ముగింపు వేడుకల్లో ఎపి వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపి మురళీ మోహన్, దర్శకులు కే. రాఘవేంద్రరావు, పారిశ్రామికవేత్త రఘురామకృష్ణంరాజు, గుంటూరు మాజీ జడ్‌పి చైర్మన్ పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ సభల నిర్వహణకు అత్యధికంగా 51వేల డాలర్ల విరాళం అందించిన డా. రాజా తాళ్ళూరి, జయశేఖర్ తాళ్ళూరిలను ఘనంగా సత్కరించారు.
Tags :