న్యూజెర్సిలో ఘనంగా ముగిసిన నాట్స్ సంబరాలు
న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో మూడురోజుల పాటు నిర్వహించిన 7వ అమెరికా తెలుగు సంబరాలు ఆదివారం రాత్రి థమన్ సంగీత విభావరితో ఘనంగా ముగిశాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి దంపతులకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఫ్యాషన్ షో, హాస్య నాటికలు, అసిరయ్య జానపద గేయాలు, పలు పూర్వ విద్యార్థుల సమ్మేళనాలతో నాట్స్ సంబరాలు సందడిగా సాగాయి. అతిథులకు అందజేసిన విందు భోజనం రుచికరంగా ఉంది. ఇంద్రా నూయి సందేశాన్ని ప్రదర్శించారు. ఎన్టీఆర్ కు ఘనంగా నివాళి అర్పించారు. సంబరాల కన్వీనర్ అప్పసాని శ్రీధర్, అధ్యక్షుడు నూతి బాపులు వేడుకల విజయవంతానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
వేడుకల్లో పాల్గొన్నవారిలో అల్లు అరవింద్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మన్నార చోప్రా, గోపీచంద్ మలినేని, సాయికుమార్, బలగం వేణు, కోదండరామిరెడ్డి, బి.గోపాల్, ఆలీ, గుత్తికొండ శ్రీనివాస్, పిన్నమనేని ప్రశాంత్, మధు కొర్రపాటి, అరుణ గంటి, మేడిచెర్ల మురళీ, తానా, ఆటా, మాటా, నాటా, టిఫాస్ తదితర సంఘాల ప్రతినిధులు ఉన్నారు.