ఘనంగా తానా పర్యావరణ దినోత్సవ వేడుకలు
అమెరికా, తెలుగు రాష్ట్రాల ప్రముఖుల ప్రసంగాలు
ఆన్‍లైన్ కార్యక్రమానికి విశేష స్పందన
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 5 నుంచి మూడురోజులపాటు నిర్వహించిన తానా అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాలు ఘనంగా ముగిశాయి. కోవిడ్ 19 కారణంగా ఆన్‍లైన్‍లో ఈ కార్యక్రమాన్ని తానా నిర్వహించింది. ముగింపు కార్యక్రమం జూన్ 8వ తేదీన జరిగింది. దాదాపు 6,248 మంది ఈ కార్యక్రమం కోసం రిజిష్టర్ చేసుకున్నారు. 154 జూమ్ స్లాట్స్ ద్వారా జరిగిన పోటీల్లో ఎంతోమంది పాల్గొన్నారు. 250 మంది ఈ పోటీలకు జడ్జీలుగా వ్యవహరించారు. అమెరికా, ఇండియాలోని ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి తానా ఉమెన్స్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల, జిఙాసకు చెందిన భార్గవ్ మోడరేటర్లుగా వ్యవహరించారు. తొలుత శిరీష తూనుగుంట్ల స్వాగతోపన్యాసం చేసి, ప్రముఖులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్వాగతోపన్యాసం చేసిన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‍రాజన్ మాట్లాడుతూ, ప్రకృతిని కాపాడే బాధ్యత అందరిదని, ఈ విషయంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు. ప్రకృతిని ప్రేమించాలన్న రవీంద్రుని మాటలను ఈ సందర్భంగా ఉటంకించారు. ప్రకృతి ఒడిలో సేదతీరుతున్న మనిషి దాని పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ నేటి ఆధునిక సమాజంలో తప్పనిసరి బాధ్యత అని, ‘ఉమ్మడి లక్ష్యం-ఉమ్మడి బాధ్యత’ స్ఫూర్తితో ప్రపంచదేశాల్లోని ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని సలహాలు, సూచనలు అందించి పర్యావరణ పరిరక్షణకు సరైన ప్రణాళికలు రూపొందించేందుకు భాగస్వామ్యులు కావాలని కోరారు.
తొలిరోజు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఐరాసలో భారతీయ ప్రతినిధి రాజా కార్తికేయ, అమెరికా కాంగ్రెస్ సభ్యులు రాజా క•ష్ణమూర్తి, టామ్ సూజ్జీ, న్యూయార్క్ అసెంబ్లీ స్పీకర్ కార్ల్ హేస్టీ, ముంబయి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, ఐ.ఎ.ఎస్.అధికారి రెడ్డి సుబ్రహ్మణ్యం, ఏపీ ముఖ్యమంత్రి సలహదారుడు రామచంద్రమూర్తి, తెలంగాణా వనసంరక్షణ అధికారి ఆర్.శోభ, కేరళ వనసంరక్షణ అధికారి జీ.ఫణీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముగింపు వేడుక...
తానా పర్యావరణ దినోత్సవాల ముగింపు వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ, లాక్‍డౌన్ సమయంలో కాలుష్యం లేని వాతావరణాన్ని ప్రజలు చూశారని, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఎలా ఉంటుందో ఈ లాక్‍డౌన్ పిరియడ్ చూపించిందన్నారు. పర్యావరణంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వీలుగా తానా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అంటూ, తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరిని ఆయన టీమ్‍ను ప్రశంసించారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించాలంటే అందరూ మొక్కలను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ, ఇలాంటి కార్యక్రమాలను చేపట్టడంపై తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరిని కిషన్ రెడ్డి అభినందించారు. యుఎన్ డిప్లొమాట్ రాజా కార్తికేయ, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టిఎం. విజయభాస్కర్ ఐఎఎస్, ఇల్లినాయి స్టేట్ సెనెటర్ రామ్ విల్లివాలం, బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ డా. ఆండ్య్రూ ఫ్లెమింగ్, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ ఐఎఎస్, తదితరులు ఈ?వెబ్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.
తానా అధ్యక్షుడు జయ్ తాళ్ళూరి, తానా కార్యదర్శి రవి పొట్లూరి, తానా ఇవిపి లావు అంజయ్య చౌదరి, ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శ•ంగవరపు, తానా బోర్డ్ చైర్మన్ హరీష్ కోయ, తానా ఇంటర్నేషనల్ ఉమెన్ కో ఆర్డినేటర్ లక్ష్మీదేవినేనితోపాటు సుమంత్ రామ్ సహకారంతో, ఈవెంట్ కో ఆర్డినేటర్లు కిరణ్ పర్వతాల, వంశీ వాసిరెడ్డి, పద్మజ బెవర, దీపిక సమ్మెట, మాధురి ఏలూరి, ఉమ ఆరమండ్ల, కటికి, శ్రీలక్ష్మీ, శైలజ, శ్రీలక్ష్మీ మామిడిపల్లి, హిమబిందు కోడూరు, రమ కుమారి వనమా, నెహ్ర కటారు, రాధతోపాటు ఇండియా నుంచి పలువురు కో ఆర్డినేటర్లు ఈ కార్యక్రమ విజయవంతానికి సహకరించారు. నిఖిల బొప్పన, వెంకటేష్ బత్తుల, మృదుల నీహారిక, ప్రభంజన్ దర్శి కూడా ఈ వేడుకల విజయంలో కీలకపాత్ర పోషించారు.
డా. విజయ్ భాస్కర్, జిఙాస భార్గవ్, సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రవికుమార్ మంద, అనిల్ రాచమల్లతోపాటు తానా రీజినల్ నాయకులు, న్యూయార్క్, న్యూజెర్సి టీమ్ ఫ్రెండ్స్ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించినట్లు తానా ఉమెన్స్ కో ఆర్డినేటర్ శిరీష తూనుగుంట్ల చెప్పారు.