ASBL Koncept Ambience

ఘనంగా ముగిసిన టిటిఎ కన్వెన్షన్ వేడుకలు

ఘనంగా ముగిసిన టిటిఎ కన్వెన్షన్ వేడుకలు

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సిలో మే 27 నుంచి 29వ తేదీ వరకు జరిగిన మెగా కన్వెన్షన్‌ అంగరంగ వైభవంగా ముగిసింది. టిటిఎ అధ్యక్షుడు మోహన్‌ రెడ్డి పాటలోళ్ళ, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌  శ్రీనివాస్‌ గనగోని ఆధ్వర్యంలో కన్వెన్షన్‌ కమిటీ సభ్యులు ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించారు.

న్యూజెర్సీ కన్వెన్షన్‌ సెంటర్లో 27వ తేదీ రాత్రి బాంక్వెట్‌ కార్యక్రమంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మహాగణపతి నృత్యగీతంతో కార్యక్రమాలు ప్రారంభించారు. నృత్యమాధవి స్కూల్‌ ఆఫ్‌ డ్యాన్స్‌కు చెందిన శ్రీమతి దివ్యఏలూరి శిష్యులు ఈ నృత్యగీతాన్ని చేశారు. తరువాత విశిష్ట ప్రతిభ కనబరిచిన వారికి అవార్డులను అందజేశారు. శ్రీమతి స్వాతి అట్లూరి టీమ్‌ ఇదేరా తెలంగాణ పేరుతో డ్యాన్స్‌ కార్యక్రమం చేశారు. డోనర్లను సత్కరించారు.

ఈ కన్వెన్షన్‌ ను పురస్కరించుకుని తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా పరిసరాలను తీర్చిదిద్దారు బ్యాంక్వెట్‌ విందులో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలంగాణాకు చెందిన ఎంపీలు డి అరవింద్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి వివిధ పార్టీల నాయకులు డీకే అరుణ, మధుయాష్కి, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. టిటిఎ వ్యవస్థాపక అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు  మోహన్‌ రెడ్డి పాటలోళ్ళ, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ గనగొని శ్రీనివాస్‌ తదితరులు ప్రసంగించారు. యాంకర్‌ సుమ సంధానకర్తగా వ్యవహరించారు. చివరన ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఆధ్వర్యంలో సంగీత విభావరి నిర్వహించారు. ఎంతగానో ఆకట్టుకున్న ఈ సంగీత విభావరి టిటిఎ బాంక్వెట్‌ కార్యక్రమంలో హైలైట్‌గా నిలిచింది.

అలరించిన టిటిఎ సాంస్కృతిక కార్యక్రమాలు

న్యూజెర్సిలో జరుగుతున్న టిటిఎ కన్వెన్షన్‌ వేడుకల్లో భాగంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అందరినీ ఎంతగానో అలరించాయి. కల్చరల్‌ చైర్‌ అశోక్‌ చింతకుంట ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలంగాణ వైభవాన్ని సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా ప్రదర్శించిన స్వాగత నృత్యం గీతం అలరించింది. జొన్నవిత్తుల, వడ్డేపల్లి కృష్ణ దీనిని రూపొందించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అలరించాయి. సినీ కళాకారులతోపాటు జబర్దస్త్‌ టీమ్‌కు చెందిన కళాకారులు కూడా తమవంతుగా ఎన్నారైలను ఈ కన్వెన్షన్‌లో అలరించారు. జబర్దస్త్‌ కళాకారులు అభి, రాఘవ తమ కళా ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.

తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ మెగాకన్వెన్షన్‌ను పురస్కరించుకుని వందేమాతరం శ్రీనివాస్‌ మ్యూజిక్‌ సమకూర్చిన వడ్డేపల్లి కృష్ణ, జొన్నవిత్తుల రచించిన స్వాగత గీతం పలువురి ప్రశంసలను అందుకుంది. ఈ స్వాగతగీతాన్ని దాదాపు 50 మందికిపైగా మహిళలు, చిన్నారులు పాడారు.

కన్వెన్షన్‌లో హైలైట్‌గా తెలంగాణ కళా ప్రదర్శన రూపకం నిలిచింది. తెలంగాలోని ప్రముఖ కళలను ఇందులో ప్రదర్శించారు. లంబడా, గుస్సాడి, థింసా, పేరిణి, బుర్రకథలు ఇతర కళా రూపాలతో ఈ తెలంగాణ కళా ప్రదర్శన సాగింది. తెలంగాణ వైభవం పేరుతో మరో డ్యాన్స్‌ బ్యాలెట్‌ కూడా ఈ మెగా కన్వెన్షన్‌లో హైలైట్‌ అయింది. తెలంగాణ కవులు, కళాకారులు, పుణ్య క్షేత్రాలు, తెలంగాణ స్వాతంత్య్రసమర యోధులతో ఈ డ్యాన్స్‌ బ్యాలెట్‌ను తయారు రూపొందించి ప్రదర్శించారు. జొన్నవిత్తులగారు రాసిన ఈ రచనకు వందేమాతరం  శ్రీనివాస్‌ సంగీతం అందించారు. 

టిటిఎ పొలిటికల్‌ ఫోరంలో పాల్గొన్న నాయకులు

న్యూజెర్సి టిటిఎ కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన పొలిటికల్‌ ఫోరం కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.  తెరాస ఆలేరు ఎమ్మెల్యే సునీత, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి, భాజపా నేత ప్రదీప్‌ రెడ్డి, తెరాసకు చెందిన నల్గొండ జిల్లా నేత మహేందర్‌ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు ప్రభాకర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు.టిటిఎ ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ వంశీరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఫోరం కన్వీనర్‌ భాస్కర్‌ స్వాగతం పలికారు.

ఘనంగా ముగింపు వేడుకలు

కన్వెన్షన్‌ చివరి రోజున ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాలు వచ్చినవారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రచించిన తెలంగాణ వైభవం నాట్య రూపకాన్ని వందేమాతరం శ్రీనివాస్‌ ఆలపించారు. నాట్య విద్యార్థులు ఈ రూపకాన్ని ప్రదర్శించారు.  తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కన్వెన్షన్‌లో హైలైట్‌గా నిలిచిన ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీత విభావరి ఎంతోమందిని ఉత్సాహపరిచింది.

వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం

టిటిఎ ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఉదయం వేదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. అమెరికాలో తొలిసారిగా ఈ కళ్యాణం జరగడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కళ్యాణం లో పాల్గొన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని తరించారు.

తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ ఉత్సవాలు న్యూజెర్సీ కన్వెన్షన్‌ సెంటర్లో శుక్రవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా పరిసరాలను తీర్చిదిద్దారు బ్యాంక్‌  వెట్‌ విందుతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు అందజేశారు. తెలంగాణాకు చెందిన ఎంపీలు డి అరవింద్‌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌ రెడ్డి వివిధ పార్టీల నాయకులు డీకే అరుణ, మధుయాష్కి,  మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. %ుుA% వ్యవస్థాపక అధ్యక్షుడు పైళ్ల మల్లారెడ్డి, అధ్యక్షుడు పటోళ్ల మోహన్‌ రెడ్డి, కాన్ఫరెన్స్‌ కమిటీ కన్వీనర్‌ గనగొని శ్రీనివాస్‌ తదితరులు ప్రసంగించారు. యాంకర్‌ సుమ సంధానకర్తగా వ్యవహరించారు. కోటి సంగీత విభావరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు.

న్యూజెర్సీలో జరుగుతున్న తెలంగాణ తెలుగు అసోసియేషన్‌ సంబరాలలో భాగంగా శనివారం నాడు పొలిటికల్‌ ఫోరం ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి న్యూజెర్సీలోనే ఉన్న రాజకీయ పార్టీల సీనియర్‌ నేతలు గైర్హాజరు కావడంతో పొలిటికల్‌ ఫోరమ్‌ కు హాజరైన సభికులు నిరాశకు గురయ్యారు. టిపిసిసి అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి, భాజపా ఎంపీ డీ.అరవింద్‌, కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, భాజపా నేత డీకే అరుణలు ఈ ఫోరంలో పాల్గొనడానికి ఆసక్తి చూపలేదు. తెలంగాణలో తీవ్ర స్థాయిలో కొట్లాడుకుంటున్న ఈ పార్టీల నేతల అభిప్రాయాలను అమెరికాలో వినాలనుకున్న ప్రవాస తెలుగు వారికి నిరాశే మిగిలింది. వీరు హాజరు కానప్పటికీ నిర్వాహకులు పొలిటికల్‌ ఫోరం నిర్వహించారు. తెరాస ఆలేరు ఎమ్మెల్యే సునీత, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి, భాజపా నేత ప్రదీప్‌ రెడ్డి, తెరాసకు చెందిన నల్గొండ జిల్లా నేత మహేందర్‌ రెడ్డి, ఏఐసీసీ సభ్యులు ప్రభాకర్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తదుపరి అధ్యక్షుడు వంశీరెడ్డి అధ్యక్షత వహించారు. ఫోరం కన్వీనర్‌ భాస్కర్‌ స్వాగతం పలికారు.


Click here for Event Gallery

 

 

 

Tags :