జగన్ ఆధ్వర్యంలో దావోస్ లో భారీ ఒప్పందాలు
అభివృద్ధిని పర్యారణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు దావోస్‌వేదికగా ముఖ్యమంత్రి వైయస్.జగన్ చేసిన ప్రయత్నం చక్కటి ఫలితాలను సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు దావోస్ వేదికను రాష్ట్రం వినియోగించుకుంది. విఖ్యాత కంపెనీలు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. నాలుగోతరం పారిశ్రామికీకరణకు మూలకేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు అవసరమైన గ్రీన్ ఎనర్జీకి సంబంధించే రూ.1.25కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఒప్పందం కుదుర్చుకుంది. పంప్డ్ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ రాష్ట్రంలోకి అందుబాటులోకి రానుంది. గ్రీన్‌కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడుల పెడుతున్నట్టు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్టు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ప్రకటించింది. సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ప్రశంసించారు. స్టీల్‌తో పాటు ఎనర్జీ, నిర్మాణ మైనింగ్, రవాణా, ప్యాకేజీంగ్ తదితర రంగాల్లో ఉన్న ఆర్సెలర్ మిట్టల్ గ్రూపుకు వార్షిక ఆదాయం 76.571 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ రాష్ట్రంలోకి తొలి సారిగా గ్రీన్ ఎనర్జీకి వేదికగా చేసుకుంది. కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మెనియా ఉత్పత్తులపై దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిసారించారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్ సీఈవో సైతం కితాబిచ్చారు. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్‌ఈజెడ్‌ను తీసుకు రానుండడం దావోస్ ఫలితాల్లో ఒకటి. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్ అర్బన్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడంతో పాటు, అత్యాధునిక పద్దతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈజోన్‌ను అభివృద్ధి చేస్తారు. కాలుష్యాన్ని తగ్గించు కోవడం, పర్యావరణ సమతుల్యతకు పెద్దపీట వేయడం. గ్రీన్ ఎనర్జీని వినియోగించుకోవడం, నాణ్యత పెంచుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ దిశగా రాష్ట్ర ప్రభుత్వంలో దావోస్‌లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డబ్ల్యూఈఎఫ్ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను కాలుష్యం లేని విధానాలను జోడిరచడానికి డబ్ల్యూఈఎఫ్ తగిన సహకారాన్ని అందిస్తుంది.
రాష్ట్రంలోకి కొత్తగా 4 పోర్టులు వస్తున్న దృష్ట్యా పోర్టు అధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్ సభలోసీఎం దృష్టి పెట్టారు. దస్సాల్ట్ సిస్టమ్స్ , మిట్సుయిఒ.ఎస్.కె.లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో సీఎం ఇవే అంశాలను ప్రస్తావించారు. సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్‌పోర్ట్ ప్రమోరaన్ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఒఎస్ కె లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తనీకషి హసిమొటో ప్రకటించారు. సీఎం విజ్ఞప్తి మేరకు లాజిస్టిక్ రంగాల్లో భాగస్యామానికి సుముఖత వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో ఈ సంస్థ సరుకు రవాణా చేస్తోంది.
కాగా రాష్ట్రంలోనే అతిపెద్దనగరం, ప్రభుత్వం కార్యనిర్వాహఖ రాజధానిగా ఎంపిక చేస్తున్న విశాఖపట్నంకు దావోస్ వేదికగా ప్రత్యేక గుర్తింపు లభించింది. హై ఎండ్ టెక్నాలజీ వేదికగా విశాఖ పట్నాన్ని తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించి పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షింపచేశారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హై ఎండ్ టెక్నాలజీపై పాఠ్యా ప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపై కూడా చర్చించారు. విశాఖపట్నాన్ని మేజర్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలను కుంటున్నారని టెక్ మహీంద్ర సీఈవో గుర్నాని ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత వెల్లడిరచారు. ఐబీఎం చైర్మన్, సీఈవో అరవింద్ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి.
యూనికార్న్ స్టార్టప్స్ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం జగన్ చేసిన ప్రయత్నాలు సఫలీకృతం కానున్నాయి. వివిధ ప్రముఖ సంస్థల వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు. ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్ ప్రకటించింది. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడిరచింది. పాఠ్య ప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్ వెల్లడిరచారు. సమగ్ర భూ సర్వే రికార్డుల నిక్షిప్తం చేయషడంతో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామన్న కాయిన్ స్విచ్ క్యూబర్ ప్రకటించింది. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూత నిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్‌మై ట్రిప్ వెల్లడిరచింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు.
దావోస్ వేదికపై వైద్యం, ఆరోగ్యం, విద్యా తదితర రంగాల్లో రాష్ట్రం తన ప్రగతిని వినిపించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్ పై పబ్లిక్ సెషన్‌లో పాల్గొన్న సీఎం కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను, రాష్ట్రంలో ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి విప్లవాత్మకంగా చేపడుతున్న మార్పులను వివరించారు. కోవిడ్ లాంటి విపత్తును ఎవ్వరు కూడా ఊహించలేదని, వైద్య రంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, సమగ్రమైన ఆరోగ్య వ్యవస్థ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలని, అందరి స్తోమతకూ తగినట్టుగా ఉండాలని సీఎం దావోస్ వేదికగా పిలుపునిచ్చారు.
జగన్‌తో పలువురు పారిశ్రామికవేత్తల భేటీ
ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డితో పలువురు పారిశ్రామికవేత్తలు దావోస్‌లో భేటీ అయ్యారు. కాయిన్ స్విచ్ క్యూబర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్ సీఎం వైయస్ జగన్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అదే విధంగా వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్‌సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్, ఈజీమై ట్రిప్ సహ వ్యవస్థాసకుడు ప్రశాంత్ పిట్టి, మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ సీఎం వైయస్ జగన్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని సీఎం వైయస్ జగన్ వారికి అందజేశారు.
పలు అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి పలు కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేశాయి. విద్యారంగంలో ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. విశాఖను హైఎండ్ టెక్నాలజీ హబ్‌గా మార్చేలా సహకారం అందించేందుకు టెక్ మహీంద్రా ముందుకొచ్చింది. జపాన్‌కు చెందిన ప్రముఖ లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి కాకినాడలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సంసిద్ధత తెలిపింది.
యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో సీఎం భేటీ
యూనికార్న్ స్టార్టప్స్ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, బైజూస్ వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్ పాలసీ సుష్మిత్ సర్కార్, కాయిన్‌స్విచ్ క్యూబర్ వ్యవస్థాపకుడు, గ్రూప్ సీఈఓ ఆశిష్ సింఘాల్, ఈజీమై ట్రిప్ ప్రశాంత్‌పిట్టి, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్‌సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు.
రూ.250 కోట్లతో అసాగో ఇథనాల్ ప్లాంట్
మహీంద్రా గ్రూపు అనుబంధ కంపెనీ అసాగో ఇండస్ట్రీస్ రాష్ట్రంలో రూ.250 కోట్లతో ఇథనాల్ తయారీ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనను సీఎం దృష్టికి తెచ్చింది. ఇథనాల్ యూనిట్ ఏర్పాటుకు అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.
విద్యారంగంలో ‘దస్సాల్’ పెట్టుబడులు
విద్య, నైపుణ్యాభివృద్ధి లాంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ దస్సాల్ట్ సిస్టమ్స్ ప్రకటించింది. దావోస్‌లో దస్సాల్ట్ సిస్టమ్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్లోరెన్స్ వెర్జలెన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సరికొత్త ఆవిష్కరణలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పోర్టులను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సహకారం అందించాలని సీఎం కోరారు. ఏపీలో నైపుణ్యాభివృద్ధి అవకాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా చర్చించినట్లు అనంతరం ఫ్లోరెన్స్ వెర్జలెన్ తెలిపారు. ఏపీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని, విద్యారంగంలో పెట్టుబడులు పెట్టడానికి దస్సాల్ సిస్టమ్స్ ఆసక్తిగా ఉన్నట్లు ఆమె ప్రకటించారు. కొత్త తరహా ఇంధనాలపై కూడా చర్చించామని, త్వరలోనే రాష్ట్రంలో పర్యటించనున్నట్లు ఫ్లోరెన్స్ తెలిపారు.
కాకినాడకు జపాన్ లాజిస్టిక్ దిగ్గజం
సుదీర్ఘ తీర ప్రాంతం కలిగి ఉండటంతో పాటు ఏపీలో కొత్తగా నిర్మించే నాలుగు పోర్టుల ద్వారా లభించే లాజిస్టిక్ అవకాశాలను అందిపుచ్చు కోవడంపై జపాన్‌కు చెందిన లాజిస్టిక్ కంపెనీ మిట్సుయి ఓ ఎస్‌కే లైన్స్ ఆసక్తి వ్యక్తం చేసింది. మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో తకీషి హషిమొటోతో సీఎం జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 4 గ్రీన్‌ఫీల్డ్ పోర్టులతో సరుకు రవాణాను ఏటా 507 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, దీనికి సంబంధించి కంటైనర్ హబ్, లాజిస్టిక్ రంగాలపై దృష్టి సారించాలని సీఎం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హషిమొటో కాకినాడలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఈవీ వాహనాలపై ‘హీరో’తో చర్చలు
రాష్ట్రంలో వ్యాపార విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ అంశాలపై హీరో గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్‌తో సీఎం జగన్ చర్చించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన హీరో గ్రూపు అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36 శాతం వాటాను కొనుగోలు చేయడమే కాకుండా తైవాన్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ గగొరోలో భాగస్వామిగా చేరింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, హీరో గ్రూప్ విస్తరణ అవకాశాలపై చర్చలు జరిగాయి.
భారత సంతతికి చెందిన స్విస్ ఎంపీ నిక్లాజ్ శామ్యూల్ గుగెర్‌తో కూడిన స్విస్ పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో సీఎం జగన్ సమావేశమై ఏపీలో వ్యాపార అవకాశాలపై చర్చించారు. భారత రాయబారి సంజయ్ భట్టాచార్య కూడా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు.
ఫుడ్ హబ్‌గా ఏపీ
దావోస్‌లోని కాంగ్రెస్ సెంటర్లో డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ క్లాజ్ ష్వాప్‌తో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్లాజ్ మాట్లాడుతూ.. ఏపీకి అపార అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా ధాన్యాగారంగా పేరొందిన రాష్ట్రం ఫుడ్ హబ్‌గా మారేందుకు అన్ని రకాల పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ప్రపంచంలో పలు చోట్ల ఆహార కొరత ఏర్పడుతున్న పరిస్థితులను తీర్చడంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించగలదని తెలిపారు. అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకోవడానికి ష్వాప్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణం, అభివృద్ధిపై చర్చించారు. పోర్టుల ఆధారిత పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాలను గణనీయంగా మెరుగు పరచడంపై శ్రద్ధ పెట్టామని చెప్పారు. పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు, భవిష్యత్ తరాలను ఉత్తమంగా తీర్చిదిద్దడానికి విద్య, వైద్య రంగాల్లో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నామని సీఎం వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికీ, వారి గడప వద్దకే సేవలు అందిస్తున్నామని చెప్పారు.
ఏపీ చర్యలపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ప్రశంస
బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) గ్లోబల్ చైర్మన్ హాన్స్‌పాల్ బక్నర్‌తో సీఎం జగన్ సమావేశమ్యారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. అనుమతుల్లో జాప్యం లేకుండా సింగిల్ డెస్క్ విధానం ద్వారా పరిశ్రమలు పెట్టాలనుకునే వారికి అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. ప్రపంచంలో తూర్పు భాగానికి రాష్ట్రం గేట్‌వేగా మారేందుకు అన్ని రకాల అవకాశాలున్నాయని, ఇందుకోసం కొత్తగా మూడు పోర్టుల నిర్మాణం ప్రారంభించామన్నారు. విద్య, వైద్య రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను బీసీజీ గ్లోబల్ చైర్మన్ బక్నర్ ప్రశంసించారు. నైపుణ్య మానవ వనరులను తయారు చేయడానికి చేపట్టిన కార్యక్రమాల వల్ల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు.
అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలపై వారిద్దరూ చర్చించారు.
షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను సందర్శించిన జగన్
దావోస్ పర్యటనలో సీఎం వైయస్ జగన్ దావోస్‌లో ఉన్న షిండ్లర్ ట్రైనింగ్ సెంటర్‌ను పరిశీలించారు. ట్రైనింగ్ సెంటర్ అంతా కలియదిరుగుతూ అక్కడ శిక్షణ జరుగుతున్న తీరును షిండ్లర్ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు.
సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ప్రవాసాంధ్రులు
స్విట్జర్లాండ్‌లోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రవాసాంధ్రులు సీఎం వైయస్ జగన్‌ను దావోస్‌లో కలిశారు. ఏపీలో చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కితాబిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం, విద్యా, వైద్య రంగాల్లో చక్కటి కృషిచేస్తున్నారన్నారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని సీఎం వైయస్ జగన్‌కు ప్రవాసాంధ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రతి ఒక్కరికీ అందుబాటులో సమగ్ర ఆరోగ్యవ్యవస్థ
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరికీ సమగ్ర ఆరోగ్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు దావోస్ వేదికగా జరుగు తున్న ప్రపంచ ఆర్థిక సదస్సు (డబ్ల్యూఈఎఫ్)లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. కోవిడ్ లాంటి విపత్తులు మరోసారి వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేలా బలమైన వ్యవస్థను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలో 2 వేల జనాభా దాటిన ప్రతి గ్రామంలో వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజీ చొప్పున ఇప్పుడున్న 11 కాలేజీలకు అదనంగా మరో 16 వైద్య కళాశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. వచ్చే మూడేళ్లలో వైద్య ఆరోగ్య రంగంపై రూ.16,000 కోట్లు వ్యయం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా ఫ్యూచర్ ఫ్రూఫింగ్ హెల్త్ సిస్టమ్స్‌పై సీఎం జగన్ మాట్లాడారు. కోవిడ్ విపత్తు నుంచి చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది. నివారణ, నియంత్రణ చికిత్స విధానాల ప్రాముఖ్యత తెలుసుకోవాలి. సమగ్ర ఆరోగ్య వ్యవస్ధ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలి. కోవిడ్, తదనంతర పరిణామాలన్నీ మనకు కనువిప్పు లాంటివి. ఒక దేశం, ఒక రాష్ట్రం పరిధిలో ఎంతవరకు చేయగలమో అంతా చేశాం. కోవిడ్ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్‌పై దృష్టి పెట్టింది.
ఇక నియంత్రణ చర్యల విషయానికొస్తే జిల్లా ఆసుపత్రులు, ఏరియా ఆసుపత్రులు, బోధనా సుపత్రులు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. పార్లమెంట్ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలకు బోధనాసుపత్రుల సేవలను సమానంగా అందించాలన్నదే లక్ష్యం. మెడికల్ కాలేజీలు ఏర్పాటైనప్పుడే పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే ఆ మెడికల్ కాలేజీలను అనుసంధానం చేయడం సాధ్యమవుతుంది. దీనికి మూడేళ్ల కాల పరిమితి విధించుకున్నాం. మొత్తం మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మూడేళ్లలో రూ.16 వేల కోట్లు సమీకరణ చేయాలని నిర్దేశించుకున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ రంగానికి వస్తే ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ పథకం ప్రవేశపెట్టారు. దాదాపు వెయ్యి చికిత్సా విధానాలు ఇందులో కవర్ అవుతున్నాయి. ఏపీలో ప్రత్యేకంగా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి 2,446 చికిత్స విధానాలకు వర్తింప చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో 2 వేల జనాభా ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామని జగన్ వివరించారు.