ASBL Koncept Ambience

ప్రవాస పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

ప్రవాస పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని అబుదాబిలో ప్రవాస పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి తెలుగు పద్మశాలి ప్రవాస కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ ఉగాది పచ్చడిని తయారు చేసి అందరికి వడ్డించారు. పంచాంగ శ్రవణంతో పాటు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. యూఏఈ ఇమిగ్రేషన్‌ అధికారి అల్‌ అమిరి ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలి సంఘం నేతలు జగదీశ్‌, శ్రీసాగర్‌, శ్రీకాంత్‌, శ్రీనివాస్‌, సందీప్‌, సౌజన్య, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Tags :