నాటా వేడుకలకు స్వాగతం...సుస్వాగతం
తెలుగు సంస్కృతి, సంప్రదాయం, సమాజసేవే ప్రాధాన్యతగా ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) చేస్తున్న కృషిలో భాగరగా ఫిలడెల్పియాలో జూలై 6 నుంచి మూడురోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ వేడుకలకు వస్తున్నవారందరికీ నాటా కన్వెన్షన్ కమిటీ తరపున స్వాగతం?పలుకుతున్నట్లు నాటా అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గరగసాని తెలిపారు. ఈ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు వస్తున్న పెద్దలు, యువతీ యువకులు, చిన్నారులను సరతోషపరిచే విధంగా పలు కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసినట్లు నాటా ప్రెసిడెంట్ ఎలక్ట్ రాఘవరెడ్డి గోసాల, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి కొర్సపాటి తెలిపారు.
సంగీత, సాహిత్య, సాంస్కృతిక వినోద, విఙాన, విద్య, వైద్య సంబంధిత కార్యక్రమాలతోపాటు వివిధ అంశాలపై చర్చాగోష్టులను ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు, సినీరంగానికి చెందిన హీరోలు, హీరోయిన్‌లు, కమెడియన్‌లు, నేపథ్య సినీ గాయనీ గాయకులు ఇంకా ఎందరెందరో ప్రముఖులు ఈ వేడుకలకు వస్తున్నట్లు కన్వెన్షన్ నేషనల్ కో ఆర్డినేటర్ ప్రదీప్ సామల తెలిపారు.