గేట్స్ బతుకమ్మ, దసరా వేడుకలు
గ్రేటర్ అట్లాంటాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగింది. దాంతోపాటు దసరా వేడుకలను కూడా నిర్వహించారు.
న్యూయార్క్‌లోని రివర్స్‌సైడ్ పార్క్ నదీ తీరంలో గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (గేట్స్) ఆధ్వర్యంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు రంగురంగుల బతుకమ్మలతో పెద్ద ఎత్తున హాజరై తమ ఆట పాటలతో అలరించారు. తర్వాత గేట్స్ అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి జమ్మిచెట్టుకు పూజ నిర్వహించి దసరా వేడుకలను ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పల్లకీ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నవీన్ భాతిని, శ్రీధర్ కస్తూరి, చందు పెద్దపట్ల, మెహెర్ సరిదే, విష్ణు బైసాని, అథర్ బాలు, ఒలివియా, శ్రీనివాస్, హారికలను గేట్స్ అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనిల్ బోడిరెడ్డి , ఉపాధ్యక్షుడు రాహుల్ చికియాలా, ప్రధాన కార్యదర్శి కిషన్ తల్లాపల్లి, కోశాధికారి అనితా నెల్లూట్ల, జనార్దన్ పన్నేలా, గోటూర్ ఈవెన్ సెక్రటరీ సునీల్, పార్సా కార్యదర్శి శ్రీనివాస్, శ్రీధర్ నెల్వల్లి, రఘు బండా, చిత్తారి ప్రభ, రామాచారీ, గణేష్ కసం, చలపతి వెన్నెమనేని, సతీష్,కరుణ్ అసిరెడ్డి, గౌతమ్ గోలి, ప్రభాకర్ భోయిపల్లి, శ్రీధర్ జుల్లపల్లి, సతీష్ చెటి తదితరులు పాల్గొన్నారు.