ASBL Koncept Ambience

జిడబ్ల్యుటిసిఎస్ సంక్రాంతి వేడుకలు

జిడబ్ల్యుటిసిఎస్ సంక్రాంతి వేడుకలు

వర్జీనియాలోని బృహత్తర వాషింగ్టన్‌ తెలుగు సాంస్కృతిక సంఘం(జిడబ్ల్యుటిసిఎస్‌) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక బాలబాలికల నృత్య ప్రదర్శనలతో మొతలైన ఈ కార్యక్రమంలో కీరవాణి బృందం సమర్పించిన సంగీత  విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కీరవాణి సంగీత విభావరి నభూతోనభవిష్యతి అన్నట్లుగా జరిగింది. ఓక్టన్‌ హైస్కూల్‌ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకలకు తెలుగు వారు భారీగా హాజరయ్యారు. వర్జీనియా, మేరీలాండ్‌, డి.సి మూడు రాష్ట్రాల తెలుగు సంగీతాభిమానులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. జిడబ్ల్యుటిసిఎస్‌ ప్రముఖులు కీరవాణిని, దాతలు రామిరెడ్డిని, గంటి భాస్కర్‌ను, వుప్పుటూరిని సత్కరించారు.

జిడబ్ల్యుటిసిఎస్‌ అధ్యక్షులు కిషోర్‌ దంగేటి కార్యవర్గ సభ్యులు సత్యన్నారాయణ మన్నె, సుధా పాలడుగు, తనుజ గుడిసేవ, చంద్ర మాలవతు, అనిల్‌ ఉప్పలపాటి, సురేష్‌ మారెళ్ళ, కృష్ణ లామ్‌, రామకృష్ణ చలసాని, రాకేశ్‌ బత్తినేని, లాక్స్‌ చేపురి, శ్రీధర్‌ మారం, అశోక్‌ వాసం, కవిత బాల, ప్రసాద్‌ రెడ్డి మందపాటి, మాజీ అధ్యక్షులు రవి గౌర్నేని ఆహూతులందరికీ  ధన్యవాదాలు తెలియచేశారు. రామ్‌ పుప్పుటూరి ఆహూతులందరికి తెలుగు సాంప్రదాయ వంటకాలైన అరిసెల్‌, బూరెలు తో కూడిన పసందైన విందు భోజనం అందించారు. కీరవాణి తన బృంద సభ్యులు రేవంత్‌, రమ్య, నోయెల్‌, మోహన, దామిని, ఆదిత్య, మౌనిమా, బైరవ, గీతా మాధురి, అనంత శ్రీరాంలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అనంత శ్రీరాం కవిత, సెల్ఫి పాట, బృందసభ్యులను పరిచయం చేస్తూ కీరవాణి పాడిన పాట అదనపు ఆకర్షణాలుగా నిలిచాయి.

అమెరికాలోని తెలుగు బాలలు చేసిన సాంస్కృతిక నృత్య  ప్రదర్శనలు మరియు జబర్దస్త్‌ ఫేం అబి తమ హాస్య చతురతతో, మిమిక్రీతో, సినిమా హీరోల డాన్స్‌ అనుకరణతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సాయి ప్రార్ధనతో మొదలైన కార్యక్రమం క్షణక్షణం, బాహుబలి,మగధీర, మర్యాద రామన్న, వేదం,  క్రిమినల్‌, మిక్రమార్కుడు మొదలైన సినిమాలోని పాటలతో సాగి, నందమూరి తారక రామారావు నటించిన మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలోని పుణ్యభూమి నా దేశం పాటతో ముగిసింది.

 

Tags :