జిడబ్ల్యుటిసిఎస్ సంక్రాంతి సంబరాలు
అమెరికాలొని వర్జీనియాలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు జనవరి 21న వైభవంగా జరిగాయి. ఓక్టన్ హైస్కూల్ ఆడిటొరియంలో జరిగిన ఈ వేడుకలకు వర్జీనియా, మేరీలాండ్, డి.సి మూడు రాష్ట్రాల తెలుగు వారు భారీగా హాజరయ్యారు. స్థానిక బాలబాలికల నృత్య, గాన ప్రదర్శనలతో కార్యక్రమం నడిచింది. గాయకులు శ్రీకాంత్, దీప్తి తమ గానంతో, వ్యాఖ్యానంతో ఆహూతులని అలరించారు.
సంబరాల్లో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలు అందరినీ ఆకర్షించాయి. మహిళలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందమైన రంగవల్లులు తీర్చిదిద్దారు. మన తెలుగు సంప్రదాయాల్ని నిలబెడుతూ GWTCS కార్యవర్గం చిన్నారులందరికి ముచ్చటగా భోగిపళ్ళ కార్యక్రమం నిర్వహించారు.
GWTCS సభ్యులు ప్రముఖ నృత్యశిక్షకురాలు సాయికాంత రాపర్ల గారిని, సాంస్కృతిక శాఖలో ఎంతో సేవ చేసిన ప్రగతి కొల్లు గారిని సత్కరించారు. TANA కార్యనిర్వాహక అధ్యక్షులు సతీష్ వేమన, రమాకాంత్ కోయ, జనార్ధన్ నిమ్మలపూడి ఈ వేడుకలో పాల్గొన్నారు.
GWTCS అధ్యక్షులు కిషోర్ దంగేటి, కార్యవర్గ సభ్యులు సత్యన్నారాయణ మన్నె, సుధా పాలడుగు, తనుజ గుడిసేవ, చంద్ర మలవతు, అనిల్ ఉప్పలపాటి, సురేష్ మారెళ్ళ, కృష్ణ లామ్, రామకృష్ణ చలసాని, రాకేశ్ బత్తినేని, లాక్స్ చేపురి, శ్రీధర్ మారం, కిరణ్ అమిరినేని ఆహూతులందరికి ధన్యవాదాలు తెలియచేశారు.
ఆష్‌బర్న్కి చెందిన ప్రముఖ రెస్టారంట్ సితార ఆహూతులందరికి పసందైన విందు భోజనం అందించారు. Baker’s Inn వారు అతిధులందరికి స్వీట్లు, కేకులు పంచిపెట్టారు.