ఘనంగా జిడబ్ల్యుటిసిఎస్ ఉగాది వేడుకలు
గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు సమితి ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను వాషింగ్టన్‌లోని తెలుగువాళ్ళు ఘనంగా జరుపుకున్నారు. ఏప్రిల్ 7వ తేదీన స్టోన్‌బ్రిడ్జ్ హైస్కూల్‌లో జరిగిన ఈ వేడుకల్లో దాదాపు 1000 మంది పాల్గొన్నారు. వేడుకలు జరిగిన ప్రాంతాన్ని ఉగాది వాతావరణం తలపించేలా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారుల నుంచి పెద్దల దాకా ఈ వేడుకలు జరిగాయి. శాస్త్రీయ నృత్యాలతోపాటు, సినిమా పాటలను, వెస్ట్రన్ డ్యాన్స్‌లను ఇందులో ప్రదర్శించారు. తానా అధ్యక్షుడు సతీష్ వేమన ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిడబ్ల్యుటిసిఎస్ కమ్యూనిటీకి చేస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ మన్నె ఎగ్జిక్యూటివ్ టీమ్‌ను ఈ సందర్భంగా అందరికీ పరిచయం చేశారు. సాయిసుధ పాలడుగు (వైస్ ప్రెసిడెంట్), తనూజ గుడిసేవ (వైస్ ప్రెసిడెంట్, కల్చరల్), రవి అడుసుమిల్లి (వైస్ ప్రెసిడెంట్, యూత్), అనిల్ ఉప్పలపాటి (సెక్రటరీ), నాగ్ నల్లూరి (ట్రెజరర్), అవినాష్ కాసా (సెక్రటరీ, కల్చరల్), కృష్ణ గూడపాటి (జాయింట్ సెక్రటరీ), కిరణ్ అమిర్నేని (జాయింట్ ట్రెజరర్), చంద్ర మలావతు (డైరెక్టర్), విజయ్ అట్లూరి (డైరెక్టర్), ప్రవీణ్ దాసరి (డైరెక్టర్), కార్తిక్ నాదెళ్ళ (డైరెక్టర్), కిషోర్ దంగేటి (పాస్ట్ ప్రెసిడెంట్) ఎగ్జిక్యూటివ్ టీమ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి చేసిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. హీరోయిన్ అనిత యాంబ్రోస్ గెస్ట్ ఆఫ్ హానర్‌గా వచ్చారు.
స్థానిక టాలెంట్‌ను ఆమె అభినందించారు. సినిమా ఆర్టిస్ట్ అశ్విని వ్యాఖ్యాతగా వ్యవహరించి కార్యక్రమాలను ప్రజంట్ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
ఈ వేడుకల్లో తెలుగు టైమ్స్ ఎడిటర్, పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు కూడా పాల్గొని జిడబ్ల్యుటిసిఎస్ సహకారంతో వర్జీనియా ప్రాంతంలో 4 పాఠశాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. వేడుకలను జయప్రదం చేసేందుకు సహకరించిన వారందరికీ జిడబ్ల్యుటిసిఎస్ టీమ్ ధన్యవాదాలను తెలియజేసింది.